Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Honey Singh: గృహహింస ఆరోపణలతో కోర్టుకెక్కిన భార్య.. రూ.కోటి భరణం ఇచ్చి విడాకులు తీసుకున్న ఫేమస్ సింగర్..

హనీసింగ్ తనను మానసికంగా.. ఆర్థికంగా వేధింపులకు గురిచేశాడంటూ గతేడాది షాలిని తల్వార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో తీస్ హజరీ కోర్టులో

Singer Honey Singh: గృహహింస ఆరోపణలతో కోర్టుకెక్కిన భార్య.. రూ.కోటి భరణం ఇచ్చి విడాకులు తీసుకున్న ఫేమస్ సింగర్..
Honey Singh
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 10, 2022 | 3:05 PM

యో యో హనీ సింగ్ (Singer Honey Singh).. పరిచయం అవసరం లేదు. పంజాబీ సాంగ్స్‎తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ సింగర్. అతి తక్కువ సమయంలోనే తన పాటలతో సినీ పరిశ్రమలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా తన భార్య షాలిని తల్వార్‏తో విడాకులు తీసుకున్నారు. ఈవిషయాన్ని యోయో హనీ సింగ్ స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా విడాకుల కోసం తన భార్యకు రూ. కోటి భరణం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతేడాదిలో హనీ సింగ్ పై అతడి భార్య షాలిని గృహహింస ఆరోపణలు చేసింది. ఇక సెప్టెంబర్ 8న గురువారం హనీసింగ్, షాలిని తల్వార్ ఢిల్లీలోని సాకేత్ కోర్టులో మధ్యవర్తిత్వ ప్రక్రియలో భరణం ఒప్పందం జరిగింది. న్యాయమర్తి వినోద్ కుమార్ సమక్షంలో హనీసింగ్, షాలిని తల్వార్‏కు రూ. కోటి భరణం ఇచ్చారు.

హనీసింగ్ తనను మానసికంగా.. ఆర్థికంగా వేధింపులకు గురిచేశాడంటూ గతేడాది షాలిని తల్వార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో తీస్ హజరీ కోర్టులో హనీసింగ్ పై గృహహింస కేసు నమోదైంది. ఇరువురు వాదనలు విన్న అనంతరం వీరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. పదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు 2011 జనవరిలో మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే వీరిమధ్య విభేదాలు తలెత్తడం.. తనను మానసికంగా వేధిస్తున్నాడని.. హనీ సింగ్ ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ అతడి భార్య షాలిని కోర్టును ఆశ్రయించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.