AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South India Actress: తమ డబ్బులు, ఆస్తులు తమ తల్లిదండ్రులను దగ్గర నుంచి ఇప్పించమని కోర్టు మెట్లు ఎక్కిన హీరోయిన్లు ..

కొంతమంది హీరోయిన్లు జీవితం శ్లేష్మంలో పడిన ఈగ వంటిది అన్న సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా తమను ఆస్తిగా.. తమను సంపాదనపరులుగా భావించి ఇబ్బంది పెట్టిన తల్లిదండ్రులు ఉన్నారంటూ కోర్టు మెట్లు ఎక్కిన హీరోయిన్లు అనేక మంది ఉన్నారు.

South India Actress: తమ డబ్బులు, ఆస్తులు తమ తల్లిదండ్రులను దగ్గర నుంచి ఇప్పించమని కోర్టు మెట్లు ఎక్కిన హీరోయిన్లు ..
Star Heroines
Surya Kala
|

Updated on: Sep 10, 2022 | 3:51 PM

Share

South India Actress: చేతి ఐదు వెళ్లే ఒకలా ఉండవు.. మరి అలాంటిది ఇద్దరి వ్యక్తుల యొక్క అభిప్రాయాలు, అభిరుచులు ఆలోచనలు ఒకేలా ఎలా ఉంటాయి.. దీంతో వ్యక్తుల మధ్య అయినా కుటుంబ సభ్యుల మధ్య అయినా చిన్న చిన్న తగాదాలు ఏర్పడడం మనస్పర్థలు తలెత్తడం సర్వసాధారణం. సామాన్య కుటుంబంలో ఏర్పడే సమస్యలు అయితే వారి మధ్యనే లేదా కుటుంబ పెద్దల సమక్షంలో పరిష్కారం అయ్యేలా చూసుకుంటారు. అదే సెలబ్రెటీల కుటుంబం విషయంలో సమస్యలు ఏర్పడితే.. అది మొత్తం ప్రపంచానికి తెలిసేలా వైరల్ అవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన అనంతరం.. ఏ సెలబ్రెటీ కుటుంబంలో చిన్న విషయం చోటు చేసుకున్నా క్షణాల్లో వైరల్ అవుతుంది. చాలామంది సినీ నటీనటుల జీవన శైలిని చూసి ఎందరో అసూయ పడతారు. కానీ కొంతమంది హీరోయిన్లు జీవితం శ్లేష్మంలో పడిన ఈగ వంటిది అన్న సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా తమను ఆస్తిగా.. తమను సంపాదనపరులుగా భావించి ఇబ్బంది పెట్టిన తల్లిదండ్రులు ఉన్నారంటూ కోర్టు మెట్లు ఎక్కిన హీరోయిన్లు అనేక మంది ఉన్నారు. నాటి హీరోయిన్ కాంచన దగ్గర నుంచి నేటి అమీషా పటేల్ వరకూ అనేకమంది తమ తల్లిదండ్రులు తమ డబ్బులను, ఆస్తులను ఉపయోగించుకుని తమని అన్యాయం చేశారంటూ ఆరోపించారు. కోర్టులో కేసులు కూడా వేశారు.

కాంచన మాల:  ఎయిర్ హోస్టెస్ నుంచి హీరోయిన్ గా వెండి తెరపై అడుగు పెట్టిన కాంచన .. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను అలరించింది. అప్పట్లో సూపర్ అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కాంచన సంపాదన తల్లిదండ్రులు అనుభవిస్తూ.. తన పెళ్లిని నిర్లక్ష్యం చేశారంటూ ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు. బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడుపుతున్న కాంచన తన ఆస్థి కోసం కోర్టు మెట్లు ఎక్కి.. దక్కించుకున్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

కుష్బూ: బాలనటి నుంచి హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన కుష్బూ కూడా ఆస్థి కోసం తన తల్లిదండ్రులపై కేసు వేశారు. అంతేకాదు అప్పట్లో తనకు తండ్రి లేడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

అమీషా పటేల్: బద్రి సినిమాతో తెలుగు వారికీ సుపరిచితమైన అమీషా పటేల్ కూడా తల్లిదండ్రులుపై కేసు పెట్టింది.  అమీషా తన తల్లిదండ్రులు తన డబ్బును తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారని ప్రకటించింది. అంతేకాదు ఆమె తండ్రి అమిత్ పటేల్‌పై 12 కోట్ల రూపాయల కోసం దావా వేసింది.

వనిత విజయ్ కుమార్: ముఖ్యంగా ఆస్తుల కోసం తల్లిదండ్రులపై కేసు పెట్టిన నటి అనగానే మంజుల, విజయ్ కుమార్ ల మొదటి కూతురు వనిత వెంటనే గుర్తుకొస్తుంది. తన తల్లి మరణించిన అనంతరం తన తండ్రి విజయ్ కుమార్ రూపాయి కూడా ఇవ్వలేదంటూ పోలీసులకు కంప్లైయింట్ ఇచ్చింది.  తల్లి మంజుల ఆస్తిని విజయకుమార్ తీసుకుని..  తనకు ఇవ్వలేదని కోర్టులో కేసు వేసింది.

సంగీత: ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగీత కూడా తల్లిదండ్రులు తనను ఆస్తులను సంపాదించడం కోసమే హీరోయిన్ గా చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తనను హీరోయిన్ చేసి తల్లిదండ్రులు తన భవిష్యత్ ను నాశనం చేశారంటూ ఒకొనొక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేసింది.

వీరు మాత్రమే కాదు. రాశి, లిజి వంటి అనేక మంది నటీమణులు తమ ఆస్తులు, డబ్బులను తీసుకుని తమను తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టారని అప్పట్లో ఆరోపించిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..