AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roja Selvamani: ‘నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు థాంక్స్’.. భావోద్వేగ పోస్ట్ చేసిన రోజా..

సమాజ సేవలో తనవంతు కృషి చేస్తున్న అన్షు త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయనున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‏గా తెలుగు తెరకు పరిచయం కాబోతుందంటూ టాక్

Roja Selvamani: 'నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు థాంక్స్'.. భావోద్వేగ పోస్ట్ చేసిన రోజా..
Roja
Rajitha Chanti
|

Updated on: Sep 10, 2022 | 4:22 PM

Share

సీనియర్ హీరోయిన్ రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచస్థాయిలో ఎన్నో అవార్డులను అందుకుంది. ఇప్పటికే పలు పుస్తకాలు రచించి రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎంట్రప్రెన్యుయర్, ప్రోగ్రామర్‏గానూ రాణిస్తోంది. ఇటీవలే ప్రముఖ ఇన్ల్ఫూయేన్సర్.. యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై కూడా ఆమె ఫోటోను ప్రచురించారు. అలాగే ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. సమాజ సేవలో తనవంతు కృషి చేస్తున్న అన్షు త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయనున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‏గా తెలుగు తెరకు పరిచయం కాబోతుందంటూ టాక్ వినిపించింది. కానీ ఈ రూమర్స్ పై నటి రోజా స్పందించలేదు. తాజాగా తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతు భావోద్వేగ పోస్ట్ చేసింది రోజా.

సెప్టెంబర్ 10 అన్షు మాలిక పుట్టినరోజు. ఈ సందర్భంగా రోజా తన ఇన్ స్టా వేదికగా అన్షు చిన్ననాటి నుంచి ప్రస్తుతం వరకు ఫోటోస్ షేర్ చేస్తూ విషెష్ తెలిపింది. ” డియర్ అన్షు. నువ్వు నా కూతురివి మాత్రమే కాదు.. మంచి స్నేహితురాలివి కూడా. నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు థాంక్స్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్షు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రతిసారీ తన పిల్లల బర్త్ డే వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రెట్ చేస్తుంటారు రోజా. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతుంటారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై హెవీరష్.. ట్రాఫిక్ డైవర్షన్ రూట్ ఇదిగో
విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై హెవీరష్.. ట్రాఫిక్ డైవర్షన్ రూట్ ఇదిగో
అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే
అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే
కింగ్ ఈజ్ బ్యాక్..91 బంతుల్లోనే సెంచరీతో నయా హిస్టరీ
కింగ్ ఈజ్ బ్యాక్..91 బంతుల్లోనే సెంచరీతో నయా హిస్టరీ
తండ్రితో రీల్స్ చేసిన కూతురు.. అంతలోనే..!
తండ్రితో రీల్స్ చేసిన కూతురు.. అంతలోనే..!
తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు
తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు