Sita Ramam: ప్రేక్షకుల మదిని తాకిన డైలాగ్స్.. సీతారామంలోని ఆ సన్నివేశాలకు భావోద్వేగంలో నెటిజన్లు

మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలకు ఆడియన్స్ ముగ్ధులయ్యారు. ఈ సినిమాలో తనకు నచ్చిన సన్నివేశాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

Sita Ramam: ప్రేక్షకుల మదిని తాకిన డైలాగ్స్.. సీతారామంలోని ఆ సన్నివేశాలకు భావోద్వేగంలో నెటిజన్లు
Sitaramam
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 10, 2022 | 2:48 PM

సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ హాను రాఘవపూడి తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకావ్యం సీతారామం (Sita Ramam). యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే ట్యాగ్‏లైన్‏తో థియేటర్లలోక విడుదలై ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి మంచి వసూళ్లు రాబట్టడమే కాకుండా చాలా కాలం తర్వాత ఆడియన్స్.. సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సినిమాగా నిలిచింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సహజ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సీతారామంలోని సాంగ్స్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఆగస్ట్ 5న విడుదలైన సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 9న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు థియేటర్లలో చూడనివారు ఓటీటీలో చూసి ఆనందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలకు ఆడియన్స్ ముగ్ధులయ్యారు. ఈ సినిమాలో తనకు నచ్చిన సన్నివేశాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

కన్నీళ్లతో ఈ ఉత్తరం తడిచిపోవడం కనిపిస్తోంది… తుడిచేసుకో.. వినిపిస్తోంది నన్ను తిరిగి రమ్మనే నీ పిలుపు.. నా చుట్టూ ఉన్న నిశ్శబ్ధాన్ని చెరిపేస్తోంది. నెలకు రూ. 600 సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలేసి వచ్చిన మహారాణి.. ఈ జన్మకి ఇక సెలవు అనే డైలాగ్స్ కన్నీళ్లు పెట్టిస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. కురుక్షేత్రంలో రావణసంహారం.. యుద్ధభూమిలో సీతా స్వయంవరం డైలాగ్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా మనదేశంలోనే ట్రెండింగ్‏లో ఉంది. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖరన్ సంగీతం అందించగా.. రష్మిక మందన్నా.. తరుణ్ భాస్కర్ కీలకపాత్రలలో నటించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వనీదత్ రూ. 30 కోట్లతో నిర్మించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?