AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Krishnam Raju passes away : కొడుకుతో కలిసి రెబల్ స్టార్ ఆ సినిమాల్లో నటించారు.. అభిమానులను అలరించారు

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఏర్పరుచుకున్న నటుడు కృష్ణం రాజు(Krishnam Raju ). రెబల్ స్టార్ గా ఆయన సినీ ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం.

Actor Krishnam Raju passes away : కొడుకుతో కలిసి రెబల్ స్టార్ ఆ సినిమాల్లో నటించారు.. అభిమానులను అలరించారు
Krishnam Raju Prabhas
Rajeev Rayala
|

Updated on: Sep 11, 2022 | 10:17 AM

Share

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఏర్పరుచుకున్న నటుడు కృష్ణం రాజు(Krishnam Raju ). రెబల్ స్టార్ గా ఆయన సినీ ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. తెరపై అన్నీ రకాల హావభావాలు పలికించే నటుడిగా కృష్ణం రాజు ప్రేక్షకుల మన్నలను అందుకున్నారు. తనదైన నటనతో, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల్లో స్థానాన్ని సంపాదించుకున్న రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన. నేడు (ఆదివారం) తెల్లవారుజామున 3.25 కన్నుమూశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం కృష్ణం రాజు స్టార్ హీరోగా రాణించారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినిమా తారలు దిగ్బ్రాంతికి గురయ్యారు.

తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు.  చికిత్స పొందుతు ఆదివారం తెల్లవారు జామున 3:25గంటలకు మరణించారు కృష్ణంరాజు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన వారసుడిగా ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్నారు. ప్రభాస్ ను హీరోగా పరిచయం చేసిన కృష్ణం రాజు ఆయనతో కలిసి మూడు సినిమాల్లో నటించారు. బిల్లా, రెబల్, రాధేశ్యామ్ సినిమాల్లో ప్రభాస్‌తో కలిసి నటించారు కృష్ణంరాజు. ముఖ్యంగా రెబల్ సినిమాలో ప్రభాస్ తో పోటీగా యాక్షన్ సీన్స్ లో నటించారు. అలాగే రాధేశ్యామ్ సినిమాలో జోత్యిష్కుడిగా నటించారు కృష్ణంరాజు. ఈ ఇద్దరినీ కలిపి స్క్రీన్ మీద చూసి ప్రేక్షకులు ఎంతగానో మురిసిపోయారు. ఈ ఇద్దరు రెబల్ స్టార్స్ కలిసి మరికొన్ని సినిమాల్లో కనిపిస్తారేమో అని అభిమానులు ఆశపడ్డారు కానీ ఇంతలోనే ఆయన కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.