Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ ఏనుగు తెలివికి జోహర్లు.. తన పనికానిచ్చేసింది.. ఆ తర్వాత..

మనుషులైనా, జంతువులైనా.. ఇలా జీవరాశులు ఏవైనా తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించాలని కోరుకుంటాయి. మనుషులైతే ఆహారాన్ని ఎలాగైనా కొనుక్కోని తినాలనుకుంటారు. మరి జంతువులైతే ఎవరైనా పెడితే..

Viral Video: ఈ ఏనుగు తెలివికి జోహర్లు.. తన పనికానిచ్చేసింది.. ఆ తర్వాత..
Elephant
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 14, 2022 | 10:41 AM

Viral News: మనుషులైనా, జంతువులైనా.. ఇలా జీవరాశులు ఏవైనా తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించాలని కోరుకుంటాయి. మనుషులైతే ఆహారాన్ని ఎలాగైనా కొనుక్కోని తినాలనుకుంటారు. మరి జంతువులైతే ఎవరైనా పెడితే తింటాయి. లేకపోతే అడవిలో దొరికేవాటినే భుజిస్తూ ఆహారాన్ని ఆస్వాదిస్తాయి. కొన్నిసార్లు ఆహార వేటలో కొన్ని జంతువులు ఎన్నో ఇబ్బందులు పడతాయి. ఆహారం కోసం లోపలకి వెళ్తే.. బయటకు రావడం కొంచెం కష్టంగా మారుతుంది. అయితే పెద్ద జంతువులైతే.. బయటకు వచ్చే మార్గం చిన్నదిగా ఉంటే లోపలే బంధిఅయిపోవాల్సి వస్తుంది. చాలా సందర్భంగాల్లో చిరుతపులులు ఇళ్లలోకి వెళ్లి.. బయటకు రాలేక ఇళ్లలోనే బంధీ అయిపోయిన సందర్భాలు గతంలో చూశాం. అయితే ఇప్పుడు ఏనుగు వంతు వచ్చింది. అయితే జనావాసాల్లో కాదు. అడవిలోనే ఓ ఇంట్లోనుంచి చిన్న ద్వారం నుండి బయటకు రావడానికి ఏనుగు తన శక్తిని, తెలివిని ఉపయోగిస్తుంది. చివరికి తన ప్రయత్నంలో విజయం సాధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయానికొస్తే..

IFS అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ఈవీడియోలో ఓఇంట్లో నుంచి తన పరిమాణానికి అంటు చిన్నగా ఉన్న ద్వారం నుంచి ఏనుగు తెలివిగా బయటకు వస్తుంది. ఈఏనుగు విన్యాసాలన్ని కెమెరాల్లో షూట్ అయ్యాయి. ఈవీడియోను చూస్తున్నవారంతా గజరాజు తెలివికి జోహర్లంటున్నారు. ఈవీడియోతో పాటు సుశాంత్ నందా దీనికి సంబంధించిన సారంశాన్ని ట్విట్టర్ లో పేర్కొన్నారు. తమకు ఇష్టమైన ఆహారం కోసం ఎటువంటి అడ్డంకులు అవరోధం కాదు. అన్ని జీవుల కంటే ఎక్కువుగా వాసనను పసిగట్టగల శక్తి ఏనుగులకు ఉందంటూ ఆయన రాసుకొచ్చారు. శునకాల కంటే దూరంలో ఉన్న వస్తువుల వాసనను గ్రహించగల శక్తి గజరాజులకుందని తన పోస్టులో తెలిపారు. వాస్తవానికి ఎన్నో మైళ్ల దూరంలో ఉన్న ఆహార రుచిని ఏనుగులు పసిగట్టగలవు. అయితే ఈఏనుగు ఆఇంట్లోకి ఎలా వెళ్లిందనేది వీడియోలో చూపించనప్పటికి.. ఒక ఇంట్లో ఉన్న ఏనుగు.. చిన్న ద్వారం ఉన్న తలుపుల నుంచి బయట పడే విధానం మొత్తం ఈవీడియోలో చూపించబడింది. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..