Telugu News Trending The incident of moving the injured man in JCB has gone viral on social media Telugu Viral news
Viral Video: ఇంకా మార్పు రాకుంటే ఎలా.. సమయానికి రాని అంబులెన్స్.. జేసీబీలోనే బాధితుడు…
మనుషుల్లో మానవత్వం రోజురోజుకు నశించిపోతోంది. సాటి మనిషి ప్రమాదానికి గురై ఆపదలో ఉన్నా సాయం చేసేందుకు ముందుకు రావడంలేదు. ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం 108 సౌకర్యాన్ని కల్పించింది. కానీ అంబులెన్స్..
మనుషుల్లో మానవత్వం రోజురోజుకు నశించిపోతోంది. సాటి మనిషి ప్రమాదానికి గురై ఆపదలో ఉన్నా సాయం చేసేందుకు ముందుకు రావడంలేదు. ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం 108 సౌకర్యాన్ని కల్పించింది. కానీ అంబులెన్స్ సిబ్బంది కూడా సమయానికి స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా బారాహీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో మహేశ్ బర్మన్ అనే యువకుడి కాలికి గాయమై విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. స్థానికంగా అంబులెన్స్ అందుబాటులో లేదని, పక్కన ఉన్న ఊరి నుంచి పంపిస్తామని చెప్పారు. గంటలు గడుస్తున్నాయి. ఎంతకీ అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులు ఆటోలో తీసుకెళ్దామని ఎందరిని అడిగినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఎవ్వరూ తమ ఆటోలో అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో పుష్పేంద్ర విశ్వకర్మ అనే వ్యక్తి తన జేసీబీలో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. దీనిని కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వీడియో చూసిన నెటిజల్లు ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో వైద్య సౌకర్యాల లేమికి ఇది నిదర్శమని ఘాటుగా స్పందిస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ సభలో పాల్గొన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్యను పెంచామని ప్రకటించడం గమనార్హం. అయితే రోగులు, వ్యాధిగ్రస్తులు, బాధితులకు సరైన సమయంలో అంబులెన్సులు అందుబాటులో లేని ఘటనలు రాష్ట్రంలో పెద్దసంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో ఓ పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భినిని జేసీబీలో తరలించిన ఘటన నీముచ్‌లో జరిగింది.