Maharashtra: పిల్లల దొంగలన్న అనుమానంతో సాధువులను చితకొట్టిన స్థానికులు.. వైరలవుతున్న వీడియో

మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు, అయితే ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు వైరల్ వీడియోలను పరిశీలిస్తున్నామన్నారు పోలీసులు. అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Maharashtra: పిల్లల దొంగలన్న అనుమానంతో సాధువులను చితకొట్టిన స్థానికులు.. వైరలవుతున్న వీడియో
Gang Attacked
Follow us

|

Updated on: Sep 14, 2022 | 10:08 AM

Maharashtra: పిల్లల దొంగలుగా అనుమానిస్తూ నలుగురు సాధువులపై ఓ బృందం దాడి చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. జిల్లాలోని లవాన గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాంగ్లీ జిల్లాలో మంగళవారం నలుగురు సాధువులపై ఓ బృందం దాడికి పాల్పడింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సాధువులను కర్రలతో కొట్టడం వీడియోలో స్పష్టంగా రికార్డైంది. అయితే దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు, అయితే ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు వైరల్ వీడియోలను పరిశీలిస్తున్నాం. అవసరమైన చర్యలు తీసుకోవాలని సాంగ్లీ ఎస్పీ దీక్షిత్ గెడం ఏఎన్‌ఐకి తెలిపారు.

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఘటనను ఖండిస్తూ, సాధువులపై ఇలాంటి దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహించదని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వీడియో సందేశంలో తెలిపారు. పాల్ఘర్ సాధువుల హత్యలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఆయనకు అన్యాయం చేసింది. కానీ ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం ఏ సాధువుపై ఎలాంటి అన్యాయం చేయదని, 2020 ఘటనను ప్రస్తావిస్తూ ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి