AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jodhpur:ప్రైవేట్‌ టీచర్‌ దాష్టీకం.. భార్య, బిడ్డను చితకబాది అర్ధనగ్నంగా వీధిలో కూర్చోబెట్టి..

భర్త కొట్టిన దెబ్బలు, ఎండవేడి తాళలేక ఆ మహిళ గుండెలవిసేలా రోధిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Jodhpur:ప్రైవేట్‌ టీచర్‌ దాష్టీకం.. భార్య, బిడ్డను చితకబాది అర్ధనగ్నంగా వీధిలో కూర్చోబెట్టి..
Jodhpur Teacher
Jyothi Gadda
|

Updated on: Sep 14, 2022 | 8:36 AM

Share

Jodhpur: భార్య, కూతురిపై అతి దారుణంగా దాడి చేసిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌ నిర్వాకం అందరినీ విస్తు పోయేలా చేసింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పడి పంతులే బుద్ది లేకుండా ప్రవర్తించిన ఘటన అందరినీ షాక్‌కు గురయ్యేలా చేస్తుంది. భార్యకు పిచ్చిపట్టిందంటూ విచక్షణారహితంగా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. అడ్డుపడిన కూతురిపై కూడా దారుణానికి ఒడిగట్టాడు. భార్య బిడ్డలను అర్థనగ్నంగా చేసి తీవ్రంగా కొట్టి..ఆరుబయట కూర్చోబెట్టాడు చదువుకున్న ఓ మూర్ఖపు టీచర్. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లో వెలుగు చూసిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ ఉదంతం చూస్తే ఎవరైనా బిత్తరపోవాల్సిందే. రాజస్తాన్‌, జోధాపూర్‌ జిల్లాలోని ఫలోడి టౌన్‌కు చెందిన కైలాష్‌ సుతర్‌ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు తన భార్యను దారుణంగా కొట్టి చిత్రహింసలు పెడుతున్న వీడియో ఇది. ఆమెను విచక్షణా రహితంగా కొడుతూ అర్థన్నంగా చేశాడు. తల్లిని కొడుతుంటే చూడలేక ఆపటానికి వచ్చి కూతుర్ని కూడా వదల్లేదు. ఆమెపై కూడా దారుణంగా దాడి చేశాడు. ఆ తర్వాత భార్యను ఎండలో నిలబెట్టాడు.

భర్త కొట్టిన దెబ్బలు, ఎండవేడి తాళలేక ఆ మహిళ గుండెలవిసేలా రోధిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం పోలీసుల దృష్టికి చేరటంతో.. ఉన్నతాధికారులు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గుర్ని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు.బాధితురాలు ఫిర్యాదు మేరకు వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేస్తామని ఫలోదీ పోలీస్‌ అధికారి రాకేశ్‌ ఖ్యాలియా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!