Shaurya Chakra: కొరియర్ ద్వారా శౌర్య చక్ర.. పతకాన్ని తిప్పి పంపిన అమరవీరుడి తల్లిదండ్రులు.. ఎందుకంటే..?
2017లో కాశ్మీర్‌లో దేశాన్ని కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన వీర జవాను ధైర్యసాహసాలకు మరణానంతరం శౌర్యచక్రను ప్రదానం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే...
2017లో కాశ్మీర్‌లో దేశాన్ని కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన వీర జవాను ధైర్యసాహసాలకు మరణానంతరం శౌర్యచక్రను ప్రదానం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ శౌర్యచక్రాన్ని కొరియర్ ద్వారా అమరవీరుడి తల్లిదండ్రులకు పంపారు. దానిపై తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి తిరిగి పంపించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా దీన్ని అలంకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. అమరవీరుడి తండ్రి ముకీమ్ సింగ్ భదౌరియా మరణానంతరం తన కుమారుడికి ఇచ్చిన శౌర్యచక్రాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. ముకీమ్ సింగ్ భదౌరియా కుమారుడు గోపాల్ సింగ్ 2017లో కాశ్మీర్‌లో విధి నిర్వహణలో వీరమరణం పొందాడు. గోపాల్ సింగ్ భార్య హేమవతి అతని ప్రయోజనాలు, రివార్డులన్నింటినీ క్లెయిమ్ చేస్తూ కోర్టులో కేసు వేశారు. ఈ కోర్టు పోరాటంలో, తల్లిదండ్రులు గెలిచారు. అమరవీరుడి తల్లిదండ్రులకు శౌర్య పురస్కారంతో పాటు అన్ని రకాల ప్రయోజనాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో బాపునగర్‌లోని ముకీమ్ సింగ్ బదౌరియా నివాసానికి కొరియర్ ద్వారా శౌర్య చక్రను పంపించింది కేంద్రం. అయితే, గోపాల్‌తో విడాకులు తీసుకున్న అతని భార్య హేమవతి వేరుగా నివసిస్తున్నారు. భార్య, తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా శౌర్యచక్ర అవార్డును కేంద్ర ప్రభుత్వం అందజేయలేదు. చివరికి శౌర్యచక్రానికి కొరియర్ ద్వారా పంపించారు. లాన్స్ నాయక్ షహీద్ గోపాల్ బహదూర్.. 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో విశిష్ట పాత్ర పోషించినందుకు అతనికి విశిష్ట సేవా పతకం కూడా లభించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

