Viral: భూగర్భం నుంచి అదే పనిగా వింత శబ్ధాలు.. భయాందోళనలో స్థానికులు
సెప్టెంబర్ 6 నుంచి భూగర్భం నుంచి వింత శబ్దాలు వినబడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Maharashtra: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా(Latur district)లోని హసోరి గ్రామం(Hasori village)లో భూగర్భం నుంచి వింత శబ్ధాలు వస్తున్నాయి. అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ విషయంపై అధ్యయనం చేయడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం నిపుణులను ఆహ్వానించారు జిల్లా అధికారులు. నీలంగా తాలూకాలో ఉన్న హసోరి గ్రామం.. కిల్లారి గ్రామానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. కిల్లారిలో 1993లో ఘోరమైన భూకంపం సంభవించి 9,700 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా హసోరి పరిసర ప్రాంతాల్లో భూకంప సూచికలు ఏమి నమోదు కాలేదని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 6 నుండి భూమి నుంచి వింత శబ్దాలు వినబడుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. లాతూర్ జిల్లా కలెక్టర్ పృథ్వీరాజ్ మంగళవారం గ్రామాన్ని సందర్శించి ప్రజలు భయాందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. నాందేడ్‌లోని స్వామి రామానంద్ తీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం బుధవారం గ్రామాన్ని సందర్శిస్తుందని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి