Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కంచు పాత్రలో నీటిని తాగడం, ఆహారం తినడం వల్ల అందంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ..

కాంస్యాన్ని తయారు చేయడానికి 400 నుండి 700 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద రాగి, టిన్‌ను కలిపి వేడి చేయడం ద్వారా కాంస్యాన్ని తయారు చేస్తారు. దీని తర్వాత ఈ లోహాన్ని

Health Tips: కంచు పాత్రలో నీటిని తాగడం, ఆహారం తినడం వల్ల అందంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ..
Bronze Vessel
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 14, 2022 | 7:41 AM

Health Tips: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్ని భయంతో వణికిపోయేలా చేసింది. దాంతో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యం కోసం ఎవరికీ వారుగా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ..ప్రతి ఒక్కకరూ తమ ఇమ్యూనిటీని పెంచుకునే పనిలోపడ్డారు. తినే ఆహారం దగ్గర నుంచి వండే పాత్రల వరకు ప్రతిదాంట్లోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా రాగి, కంచు, ఇత్తడి పాత్రలపై కూడా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వెనుకటి రోజుల్లో ఆహారాన్ని మట్టి, రాగి, ఇత్తడి పాత్రలను వంట చేయడానికి ఉపయోగించేవారు. ప్రస్తుతం కూడా అలాంటి పాత్రల వైపు మొగ్గుచూపుతున్నారు చాలా మంది. ఈ క్రమంలోనే కంచు పాత్రలో నీటిని తాగడం, భోజనం చేయటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

అయితే, దాని ప్రయోజనాలు తెలుసుకునే ముందు, కంచు ఎలా తయారవుతుందో తెలుసుకోవాలి? వాస్తవానికి, కాంస్యాన్ని తయారు చేయడానికి 400 నుండి 700 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద రాగి, టిన్‌ను కలిపి వేడి చేయడం ద్వారా కాంస్యాన్ని తయారు చేస్తారు. దీని తర్వాత ఈ లోహాన్ని షీట్ల రూపంలో తయారు చేసి, మనకు కావలసిన ఆకారాన్ని ఇవ్వవచ్చు. కంచు పాత్రలు కూడా తయారు చేస్తారు. ఆరోగ్య పరంగా ఈ కుండ చాలా మేలు చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచే కాంస్యాన్ని ‘కంసాయం బుద్ధివర్ధకం’ అంటారు. అంటే మేధస్సును పెంచడంలో ఇది ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మనం తినే ఆహారం లేదా కాంస్య పాత్రలలో నీరు తాగితే, అది మనం తీసుకున్న ఆహారం, నీటిని శుద్ధి చేయడమే కాకుండా.. మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఆహారాన్ని ఎక్కువసేపు వెచ్చగా ఉంచుతుంది.. కాంస్య పాత్ర ఆరోగ్యానికి మంచిది. కాంస్యం మంచి ఉష్ణ వాహకం. అందుకే వేడిగా ఉండే ఏదైనా ఆహార పదార్థాన్ని అందులో ఉంచితే అది చాలా సేపు వేడిగా ఉండి.. అందులో పోషకాహారం అలాగే ఉంటుంది.

సూక్ష్మజీవుల నుండి రక్షణ… మీరు ఆహారాన్ని కంచు పాత్రలలో ఉంచినట్లయితే, మీ ఆహారంలో ఏవైనా సూక్ష్మక్రిములు ఉన్నప్పటికీ, కాంస్యతో సంబంధానికి వచ్చిన కొద్దిసేపటికే అవి చంపబడతాయి. మీ ఆహారం స్వచ్ఛంగా మారుతుంది.

దోషాల సంతులనం… మీరు కాంస్య పాత్రలలో నీటిని నిల్వ చేసి.. ఎనిమిది గంటల పాటు ఉంచిన తర్వాత నీటిపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఇది మీ దోషాలను సమతుల్యం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది… ఆమ్ల ఆహారాలు, పుల్లని పదార్థాలతో కాంస్య చర్య తీసుకోదు. కంచు ఆల్కలీన్ మెటల్ కాబట్టి… మన రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

అందంగా మార్చే గుణం.. కంచు లో శరీరం రంగు తెచ్చే గుణం ఉంది. దానితో పాటు జీర్ణశక్తి పెంచుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పైత్యని హరింప చేస్తుంది..కంటికి కూడ మంచి చేస్తుంది.

అంతేకాదు.. కాన్సా ప్లేట్ ఆహారంలోని యాసిడ్ కంటెంట్‌ను తగ్గించగలదని, గట్, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఇది మంటను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, థైరాయిడ్ బ్యాలెన్స్‌లో సహాయపడుతుంది. కంచు పాత్రంలో తినడం, నీటిని త్రాగడం పూర్వం నుంచి వస్తున్న అలవాటు.. ఆయుర్వేదం ప్రకారం, కంచు పాత్రలో ఆహారం తీసుకోవడం ప్రయోజనకరంగా చెబుతారు.

కంచు పాత్రలో వంట చేయడం వల్ల 97 శాతం వరకు పోషకాలు అందుతాయని చెబుతున్నారు నిపుణులు. అదే, ఇత్తడి పాత్రలు వంటకు ఉపయోగించడం వల్ల 93 శాతం వరకు పోషకాలు అందుతాయని, అల్యూమినయం పాత్రలు, ప్రెషర్ కుక్కర్ లో 7 శాతం లేక 13 శాతం వరకు మాత్రమే పోషకాలు లభిస్తాయి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి