Silent Heart Attack: డయాబెటిక్ రోగులలో 50 శాతం మందికి గుండె జబ్బులు.. సైలెంట్ హార్ట్ ఎటాక్‌.. నిపుణుల హెచ్చరిక

Subhash Goud

Subhash Goud |

Updated on: Sep 13, 2022 | 9:53 PM

Silent Heart Attack: గత కొన్ని నెలలుగా హఠాత్తుగా గుండెపోటుతో ఎంతో మంది మృతి చెందుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు..

Silent Heart Attack: డయాబెటిక్ రోగులలో 50 శాతం మందికి గుండె జబ్బులు.. సైలెంట్ హార్ట్ ఎటాక్‌.. నిపుణుల హెచ్చరిక
Silent Heart Attack

Silent Heart Attack: గత కొన్ని నెలలుగా హఠాత్తుగా గుండెపోటుతో ఎంతో మంది మృతి చెందుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారికి సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని, శరీరంలో ఇన్సులిన్ లెవెల్ సరిగ్గా లేకపోవటం, షుగర్ లెవెల్ పెరగడమే మధుమేహం అని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అపోలో డయాగ్నోసిస్‌కు చెందిన డాక్టర్ నిరంజన్ నాయక్ మాట్లాడుతూ.. సైలెంట్ హార్ట్ ఎటాక్ అనేది ఎటువంటి లక్షణాలు లేకుండా సంభవించేది. మెడికల్ న్యూస్ టుడే ప్రకారం.. అకస్మాత్తుగా గుండె సమస్య వచ్చే వరకు ఒక వ్యక్తికి దాని గురించి తెలియదు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) ప్రకారం.. అంచనా వేసిన 8,05,000 వార్షిక గుండెపోటు కేసులలో దాదాపు 1,70,000 సైలెంట్‌ గుండెపోటులు ఉన్నాయి.

మధుమేహానికి సంబంధించినది ఏమిటి?

డయాబెటిక్ రోగులలో 50 నుండి 60 శాతం మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని అంచనా. మసీనా హాస్పిటల్‌లోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రుచిత్ షా మాట్లాడుతూ.. అధిక రక్తంలో చక్కెర ఉన్న డయాబెటిక్ రోగులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. హార్ట్‌లో బ్లాక్‌లు ఏర్పడే అవకాశాలున్నాయి. బ్లాక్ అంటే కొరోనరీ ధమనులు, మస్తిష్క ధమనులు, మూత్రపిండాలకు రక్త ప్రసరణలో నెమ్మదిగా అడ్డుపడటం. దీన్నే ‘అథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్’ అంటారు. ఇవి సాధారణంగా కలిసి ఉంటాయి. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

చక్కెర స్థాయి పెరగడం వల్ల గుండె దెబ్బతింటుంది

గురుగ్రామ్‌లోని పారాస్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ అమిత్ భూషణ్ శర్మ మాట్లాడుతూ.. కాలక్రమేణా పెరుగుతున్న చక్కెర స్థాయిల ప్రభావం గుండెను నియంత్రించే రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తుంది. సాధారణంగా టైప్ 2 డయాబెటిస్‌ని రోగి నిర్ధారణ చేసిన తర్వాత కనీసం 5 నుండి 10 సంవత్సరాల తర్వాత సంభవిస్తుందని తెలిపారు. మధుమేహం ఉన్న స్త్రీలు సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యే అవకాశం ఉంది. కానీ 2021 అధ్యయనం ప్రకారం.. లైసెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ సంభవం “మహిళలలో కంటే పురుషులలో ఎక్కువ.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu