AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India healthcare system: ఆందోళన కలిగిస్తున్న భారత్ ఆరోగ్య గణాంకాలు! ఇప్పటికీ అదే పరిస్థితి..

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ తాజాగా నేషనల్ హెల్త్ అకౌంట్స్ (NHA) నివేదిక విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అందించిన సిస్టమ్ ఆఫ్ హెల్త్ అకౌంట్స్ 2011 ఆధారంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది. ఈ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. మన దేశంలో ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం..

India healthcare system: ఆందోళన కలిగిస్తున్న భారత్ ఆరోగ్య గణాంకాలు! ఇప్పటికీ అదే పరిస్థితి..
Health Care
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 13, 2022 | 10:04 PM

India healthcare system: నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ తాజాగా నేషనల్ హెల్త్ అకౌంట్స్ (NHA) నివేదిక విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అందించిన సిస్టమ్ ఆఫ్ హెల్త్ అకౌంట్స్ 2011 ఆధారంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది. ఈ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. మన దేశంలో ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం తొలిసారి 2018-19లో 1.3 శాతానికి పడిపోయినా.. కరోనా మహమ్మారి కారణంగా 2021-22లో ఆరోగ్య రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ వ్యయం GDPలో 2.1 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించింది. 2025 నాటికి ఆరోగ్య వ్యయాన్ని మన జీడీపీలో 2.5 శాతం చేరుకోవాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది చాలా దగ్గరలో ఉండటం విశేషం. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఆరోగ్య వ్యయం దాదాపు 73 శాతం పెరిగిందన్నమాట. ఆరోగ్యంపై ప్రభుత్వం ఖర్చుచేస్తున్న వ్యయం కోవిడ్‌కు ముందు 2019-20లో రూ. 2.73 లక్షల కోట్ల నుంచి 2021-22లో రూ. 4.72 లక్షల కోట్లకు చేరుకుంది. కరోనా వ్యాక్సినేషన్ పథకానికే దాదాపు రూ.35,000 కోట్లు కేంద్రం కేటాయించింది.

ఏ దేశ సంక్షేమానికైనా ఆరోగ్యం, విద్య అనేవి రెండు మూల స్తంభాలు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయం కనీసం 2.5 శాతం నుంచి 3 శాతానికి పెరగాలని 2021 ఆర్థిక సర్వే సిఫార్సు చేసింది. ఐతే ఈ రెండు రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఈ లక్ష్యానికి దూరంగా ఉండటం విచారకరం. ప్రజలు, బీమా సంస్థలు చేసే ఖర్చుతో గత 15 యేళ్లలో ఆరోగ్యంపై చేసిన వ్యయం జీడీపీలో 4.2 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది. ప్రజలు తమ ఆరోగ్యంపై చేసే ఖర్చు 2004-05లో దాదాపు 70 శాతం ఉండగా 2018-19 నాటికి అది 48 శాతానికి తగ్గింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయం 22.5 శాతం నుంచి 40.6 శాతానికి పెరిగింది. ఐతే కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఖర్చు అధికంగా ఉంది. 2018లో UNDP విడుదల చేసిన గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) ప్రకారం.. గత 10 ఏళ్లలో మనదేశంలో పేదరికం రేటు కొంతమేర మెరుగుపడినప్పటికీ, ఆరోగ్య రంగంలో పురోగతి వెనుకబడి ఉన్నట్లు నివేదిక తెల్పింది. ఆరోగ్యంపై ప్రభుత్వ, ప్రైవేట్ వ్యయాలతో కలిపి జీడీపీలో మొత్తం 3.9 శాతం ఖర్చు చేస్తున్నారు. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ఆరోగ్యంపై అధికంగా ఖర్చుచేస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో మయన్మార్ 4.9 శాతం, నేపాల్ 6.9 శాతం, పాకిస్థాన్ 2.7 శాతం జీడీపీలో ఖర్చు చేస్తున్నాయి.

2018లో ఆరోగ్య సంరక్షణపై భారత్ ప్రైవేట్ తలసరి వ్యయం (private per capita expenditure) నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియాల కంటే ఎక్కువగా ఉంది. ఐతే అమెరికా ప్రైవేట్ తలసరి వ్యయం మన దేశం కంటే 26 రెట్లు అధికంగా ఉంది. యూకే, డెన్మార్క్ దేశాల తలసరి వ్యయం 900 డాలర్లకు కంటే ఎక్కువగా ఉండగా, బ్రెజిల్, స్వీడన్ దేశాల తలసరి వ్యయం 800 డాలర్లకుపైగా ఖర్చు చేస్తున్నాయి. రష్యా ప్రైవేట్ ఆరోగ్య వ్యయం (private health expenditure) 600 డాలర్లకుపైగా, దక్షిణాఫ్రికా 500 డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభా కలిగిన చైనా వ్యయం భారత్‌తో కంటే రెట్టింపు ఖర్చు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) విడుదల చేసిన నివేదికలో.. భారత్‌ ఆరోగ్య రికార్డు అత్యంత దుర్భరంగా ఉంది. ఇప్పటికీ ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 43 శిశుమరణాలు సంభవిస్తున్నాయి. ఈ మరణాలన్నీ వివారించదగినవి కావడం విచారకరం. ఐక్యరాజ్య సమితి ఆశించిన మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యంపై దృష్టి నిలిపితేగానీ పరిస్థితి మెరుగుపడదు.