Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election Commission: 253 రాజకీయ పార్టీలకు షాకిచ్చిన ఈసీ.. జాబితాలో కేఏ పాల్ పార్టీ కూడా..

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్ గా లేని ఇనాక్టివ్ (అచేతన) గా గుర్తించిన 253 రాజకీయ పార్టీల (Political Parties) రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి అఖండ్ భారత్ నేషనల్ పార్టీ,..

Election Commission: 253 రాజకీయ పార్టీలకు షాకిచ్చిన ఈసీ.. జాబితాలో కేఏ పాల్ పార్టీ కూడా..
Ka Paul
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 14, 2022 | 6:54 AM

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్ గా లేని ఇనాక్టివ్ (అచేతన) గా గుర్తించిన 253 రాజకీయ పార్టీల (Political Parties) రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, ఆలిండియా ముక్తి దళ్ పార్టీ, ఆలిండియా ముత్తహిదా ఖ్వామీ మహజ్, ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజాపార్టీ, భారత్ అభ్యుదయ పార్టీ, మన పార్టీ, నేషనలిస్టిక్ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజా భారత్ పార్టీ, ప్రజా పార్టీ, సురాజ్ పార్టీ లు ఉన్నాయి. అంతే కాకుండా కేఏ పాల్ (KA Paul) అధ్యక్షత వహిస్తున్న ప్రజాశాంతి పార్టీ కూడా ఉండటం గమనార్హం. ఢిల్లీ, బిహార్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 253 ఇనాక్టివ్ రాజకీయ పార్టీలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘం, చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్లు రాసిన లేఖలకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను సైతం ఇనాక్టివ్ పార్టీలుగా గుర్తించారు. కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఈ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం. ఎన్నికల చట్టాల నిబంధనలను అమలు చేయకుండా వ్యవహరిస్తున్నాయని ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా.. గతంలోనూ యాక్టీవ్ గా లేవని గుర్తించిన 111 రాజకీయ పార్టీలను తమ రిజిస్టర్‌ నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వ్యవస్థను ప్రక్షాళన చేసే లక్ష్యంతో ఈ రాజకీయ పార్టీలు వెరిఫికేషన్‌లో లేవని తేలింది. ఇంతకుముందు వారు అలాంటి 87 ఉనికిలో లేని రాజకీయ పార్టీలను తొలగించారు. మరోవైపు.. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్​ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను గతంలో కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. రిజిస్టర్ చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చినప్పుడు రద్దు చేసే అధికారాన్ని కూడా ఇవ్వాలని తెలిపింది.

కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే పార్టీలను రిజిస్టర్​చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు, 50కి పైగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏదైనా రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్న సంస్థకు పోస్టల్ అడ్రస్ తప్పనిసరి. అందులో మార్పులు ఉంటే తప్పనిసరిగా ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. అయితే చాలా రాజకీయ పార్టీలు ఈ విధానాలను పాటించడం లేదని గుర్తించాం. దీంతో పార్టీల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాం.

ఇవి కూడా చదవండి

    – కేంద్ర ఎన్నికల సంఘం

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..