Lemon Peels: తొక్కే కదా అని పడేస్తున్నారా..? నిమ్మ తొక్కల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

సాధారణంగా మనం నిమ్మకాయను పిండి వాటి తొక్కలను పనికిరానివిగా.. భావించి తరచుగా చెత్తబుట్టలో వేస్తాం. కానీ వాటి ప్రయోజనాలను ఒకసారి తెలుసుకుంటే..

Lemon Peels: తొక్కే కదా అని పడేస్తున్నారా..? నిమ్మ తొక్కల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Lemon Peels
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 13, 2022 | 9:48 PM

Lemon Peels Benefits: నిమ్మకాయ ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. ఇది చర్మం, జుట్టు, పొట్ట ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని రసం ఎంత పులుపు ఉన్నా.. ఏ ఔషధానికీ తక్కువ కాదు. సాధారణంగా మనం నిమ్మకాయను పిండి వాటి తొక్కలను పనికిరానివిగా.. భావించి తరచుగా చెత్తబుట్టలో వేస్తాం. కానీ వాటి ప్రయోజనాలను ఒకసారి తెలుసుకుంటే.. బహుశా జీవితంలో అలాంటి తప్పు చేయాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే.. నిమ్మకాయ తొక్కలను పలు రకాలుగా ఉపయోగించవచ్చు. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కావున నిమ్మకాయ తొక్కల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మ తొక్కల ప్రయోజనాలు..

  • నిమ్మ తొక్కలలో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.
  • యాంటీ-ఆక్సిడెంట్లు కూడా నిమ్మ తొక్కలలో కనిపిస్తాయి. ఇవి శరీరానికి బాహ్య, అంతర్గత మార్గంలో ప్రయోజనం చేకూరుస్తాయి.
  • నిమ్మ తొక్కలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • నిమ్మతొక్కలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దంతాలు, నోటి సమస్యలను దూరం చేస్తాయి.

నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలి

ఇవి కూడా చదవండి
  1. తొక్కలను రుబ్బుకుని కూరగాయలు, పానీయాలు లేదా సలాడ్‌లో కలుపుకుని తీసుకోవచ్చు.
  2. నిమ్మ తొక్కను మిక్సి పట్టుకొని ఆలివ్ నూనెతో కలపి పలు వంటకాలను తయారు చేసుకోవచ్చు.
  3. నిమ్మతొక్కను రుబ్బిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేస్తే బ్రెడ్ స్ప్రెడ్ గా తయారవుతుంది.
  4. వంటగదిని శుభ్రం చేయాలనుకుంటే మీరు నిమ్మ తొక్కలలో సగం బేకింగ్ సోడాను కలిపి గ్యాస్, పలు పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు.
  5. బేకింగ్ సోడా కాకుండా తొక్కల్లో వెనిగర్‌ను కూడా ఉపయోగించవచ్చు.
  6. వర్షాకాలంలో మీ శరీరంపై ఉన్న క్రిములు నశించిపోవడానికి నిమ్మతొక్కలను శరీరంపై అప్లై చేయండి.
  7. వంటగదిలో ఏదైనా మూలలో వాసన వస్తుంటే నిమ్మతొక్కను అక్కడ పెడితే వాసన పోతుంది.
  8. నిమ్మ తొక్కలను గ్రైండ్ చేసి తేనె కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. ఇది ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.
  9. నిమ్మకాయ తొక్కలను పలు ఫేస్ మాస్క్‌ల తయారీలో కూడా ఉపయోగించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి