Hair Care: ఈ నూనెలో నిమ్మరసం కలిపి మసాజ్ చేస్తే.. చుండ్రు సమస్యే ఉండదు.. ఇంకా ఎన్నో లాభాలు..
ఆవ నూనె జుట్టును దృఢంగా, నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ నూనెలో ఉండే గుణాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి.
Mustard Oil And Lemon For Hair: ఆవనూనెను చాలామంది ఇళ్లల్లో ఉపయోగిస్తారు. దీనిని ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తే పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆవాల నూనెను చాలామంది తమ జుట్టు, చర్మంపై పూస్తారు. అయితే ఆవ నూనె జుట్టును దృఢంగా, నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ నూనెలో ఉండే గుణాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. మరోవైపు అందులో నిమ్మరసం కలిపి రాసుకుంటే చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి. అటువంటి పరిస్థితిలో జుట్టుకు ఆవాల నూనె, నిమ్మకాయను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆవనూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
నేచురల్ కండీషనర్: మస్టర్డ్ ఆయిల్‌లో ఆల్ఫా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ జుట్టుకు తేమను అందిస్తుంది. ఆవాల నూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు రోజూ రాస్తే జుట్టు మెరిసిపోతుంది. ఇంకా వారానికి రెండుసార్లు నిమ్మకాయ కలిపి అప్లై చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
జుట్టుకు పోషణ: చాలా మంది జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలతో విసుగు చెందుతారు. జుట్టు రాలడానికి, చిట్లడానికి కారణం జుట్టుకు సరైన పోషకాహారం అందకపోవడమే. ఇది క్రమంగా మీ జుట్టును దెబ్బతీస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రతిరోజూ మీ జుట్టుకు ఆవాల నూనెతో మసాజ్ చేస్తే జుట్టు లోపలి నుంచి బలంగా మారుతుంది.
చుండ్రును తగ్గిస్తుంది: మస్టర్డ్ ఆయిల్, నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చుండ్రు సమస్యను దూరం చేస్తాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..