Shaving Tips: రోజూ షేవింగ్ చేయడంలేదా అయితే మీరు చాలా మిస్సవుతున్నట్లే.. అవేంటో తెలిస్తే గడ్డం తీయకుండా అస్సలు ఉండరు..
Shaving Skin Care Tips: ఫేషియల్ గ్రూమింగ్ కోసం అమ్మాయిలు ఫేషియల్ చేయించుకుంటారు. పురుషుల విషయానికి వస్తే.. డబ్బు ఆదా చేయడానికి ప్రజలు తరచుగా రోజువారీ షేవింగ్‌ను ఆశ్రయిస్తారు. అయితే రోజువారీ షేవింగ్ అనేది పురుషులకు వారి చర్మాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు వారికి ఒక వరంగా మారుతుంది. ఎలాగో తెలుసుకుందాం..
రోజువారీ షేవింగ్ మీ చర్మాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా దానికి వరం అని కూడా తెలుసా. నిజానికి రోజూ షేవింగ్ చేయడం వల్ల చర్మం పైభాగంలో పేరుకుపోయిన డెడ్ స్కిన్ తొలగిపోతుందని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు. బాగా చేసిన షేవింగ్ మిమ్మల్ని తాజాగా ఎనర్జిటిక్ గా కూడా మార్చుతుంది. అలవాటైన పనిగా కాకుండా.. కొంత శ్రద్ద పెడితే షేవింగ్ చేసుకోవడం సులువు అని చెప్పాలి. చర్మం కూడా మృదువుగా ఉంటుంది. అయితే షేవింగ్ చేసుకొన్న తర్వాత చర్మ పొడిగా ఉంటుందని కొందరు అనుకుంటారు. కానీ అలాంటి ఏమీ ఉండదు. షేవింగ్ కోసం మంచి నాణ్యమైన రేజర్, మంచి క్రీమ్‌ను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనలున్నాయి. రోజు షేవింగ్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
రోజంతా ఉత్సాహంతో కనిపిస్తారు..
షేవింగ్‌కు సంబంధించి జరిగిన పరిశోధనలో చాలా ఆసక్తకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయాన్నే మొదట షేవింగ్ చేసే వ్యక్తులు ఎక్కువ పొటెన్షియల్‌గా ఉంటారని తేలింది. అలా కాకుండా పనికి వెళ్ళే ముందు ఉదయాన్నే షేవ్ చేసుకునే వ్యక్తులు తమ రోజు పనులను మరింత క్రమపద్ధతిలో చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారని వారి పరిశోధనల్లో తేలింది.
బాక్టీరియా నుంచి రక్షణ..
మన గడ్డంలోని వెంట్రుకల్లో చాలా రకాల బ్యాక్టీరియాలు దాగి ఉంటాయి. గడ్డం పెంచేవారిలో చర్మాన్ని పాడుచేసేలా ఆ బ్యాక్టీరియా పని చేస్తుంది. ఫలితంగా ముఖంపై మచ్చలు రావడం మొదలవుతుంది. రోజూ షేవింగ్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
pH స్థాయిని కంట్రోల్ చేస్తుంది..
మీరు ప్రతిరోజూ షేవింగ్ చేసేటప్పుడు ఉపయోగించే ఉత్పత్తులు.. షేవింగ్ క్రీమ్, జెల్, ప్రీ-షేవ్ ఆయిల్ లేదా బామ్ అన్నీ మీ చర్మంలోని pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.
రోజువారీ షేవింగ్ ప్రయోజనాలు
రెగ్యులర్ షేవింగ్ చర్మం నుంచి చనిపోయిన చర్మాన్ని తొలగించడంతో పాటు.. షేవింగ్ మీ ముఖ చర్మంపై సున్నితమైన మసాజ్‌గా పని చేయడం ద్వారా లోపలి నుంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా షేవింగ్ చేయడం వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ తొలగిపోతుంది. చర్మంలో మెలనిన్, కెరాటిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
షేవింగ్ చేసేటప్పుడు ఇలా చేయండి
షేవింగ్ చేసేటప్పుడు కొన్ని సహజసిద్ధమైన వస్తువులను చర్మంపై అప్లై చేయడం వల్ల చాలా మేలు జరుగుతుందని చర్మ నిపుణులు అంటున్నారు. షేవింగ్ తర్వాత మెరిసే చర్మం పొందడానికి.. మీరు చల్లని పాలు, బొప్పాయి, ఆపిల్ సైడర్ వెనిగర్ వంటి కొన్ని వాటిని ఉపయోగించవచ్చు. ఈ విషయాలు మీ ముఖం చర్మంలో దద్దుర్లు, మంట, దురద వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం