Health Tips: టీలో బ్రెడ్ ముంచుకుని తింటున్నారా..? అయితే, ఈ రోజు నుంచే మానుకోండి.. లేకపోతే పెను ప్రమాదమే..

దేశంలో చాలామంది ఒకే రకమైన దినచర్యను అవలంభిస్తారు. రోజును ఓ కప్పు టీ, బ్రెడ్ వంటి అల్పాహారంతో ప్రారంభిస్తారు. చాలామంది రోజువారీ అల్పాహారంలో

Health Tips: టీలో బ్రెడ్ ముంచుకుని తింటున్నారా..? అయితే, ఈ రోజు నుంచే మానుకోండి.. లేకపోతే పెను ప్రమాదమే..
Tea Bread
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 11, 2022 | 4:31 PM

Side Effects Of Tea – Bread: దేశంలో చాలామంది ఒకే రకమైన దినచర్యను అవలంభిస్తారు. రోజును ఓ కప్పు టీ, బ్రెడ్ వంటి అల్పాహారంతో ప్రారంభిస్తారు. చాలామంది రోజువారీ అల్పాహారంలో టీ, బ్రెడ్‌ను చేర్చుకుంటారు. ముఖ్యంగా ఆఫీసుకు, కాలేజీకి వెళ్లే యువకులు కూడా హడావుడిగా టీ, బ్రెడ్‌ తీసుకుని వెళ్లిపోతారు. అయితే, క్రమంగా ఈ ఫుడ్‌ తీసుకుంటే.. అనారోగ్యం బారిన పడినట్లేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పేర్కొంటున్నారు. బ్రెడ్‌ని టీతో కలిపి తింటే కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణక్రియకు హాని: ప్యాకెట్లలో ప్యాక్ చేసిన బ్రెడ్‌లో ప్రిజర్వేటివ్‌లలో అనేక హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. రొట్టెను మైదా పిండితో తయారు చేస్తారు. మైదాలో ఫైబర్ లోపం ఉంటుంది. దీని కారణంగా బ్రెడ్ జీర్ణక్రియకు మంచిది కాదు. బ్రెడ్ మన జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇంకా అనేక వ్యాధులకు కారణమవుతుంది.

డయాబెటిస్‌ లో ప్రమాదమే: టీతో బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. బ్రెడ్-టీలో ఉండే మూలకాలు ఇన్సులిన్‌ను ప్రేరేపిస్తాయి. అటువంటి పరిస్థితిలో మధుమేహం ఉన్న రోగులకు బ్రెడ్ చాలా హానికరం.

ఇవి కూడా చదవండి

గుండెకు హానికరం: బ్రెడ్‌లో ఉండే ప్రిజర్వేటివ్‌లు, రసాయనాలు గుండె రోగులకు చాలా హానికరం. మీరు అల్పాహారం కోసం టీతో బ్రెడ్ తింటే కొలెస్ట్రాల్, రక్తపోటు పెరుగుతుంది. బ్రెడ్ తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇందులో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకు హానికరం.

ప్రేగులలో పూత: ఉదయాన్నే బ్రెడ్-టీతో తినడం వల్ల పొట్టలో అల్సర్ వస్తుంది. బ్రెడ్ జీర్ణవ్యవస్థకు హానికరం. ఇంకా దీనిలో టీ కలిపితే ఎసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. ఇది క్రమంగా ప్రేగులలో పూతలకి దారితీస్తుంది.

బరువు పెరుగుతుంది: బ్రెడ్‌లో పిండి పదార్థాలు, ఉప్పు, శుద్ధి చేసిన చక్కెర ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. రోజూ బ్రెడ్ తింటే, బరువు వేగంగా పెరుగుతుంది. బ్రెడ్-టీ చర్మానికి కూడా హానికరం.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..