AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: జ్వరంతో బాధపడే వారు చికెన్, చేపలు తినొచ్చా.. ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వానలు ఆహ్లాదాన్ని ఇచ్చినప్పటికీ అంతే మొత్తంలో వ్యాధులనూ మోసుకొస్తాయి. అప్రమత్తంగా ఉండకపోతే జలుబు, జ్వరాల బారిన పడేస్తాయి. ఈ కాలంలోనే పరిశుభ్రత...

Health: జ్వరంతో బాధపడే వారు చికెన్, చేపలు తినొచ్చా.. ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..
Chicken Market
Ganesh Mudavath
|

Updated on: Sep 11, 2022 | 2:37 PM

Share

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వానలు ఆహ్లాదాన్ని ఇచ్చినప్పటికీ అంతే మొత్తంలో వ్యాధులనూ మోసుకొస్తాయి. అప్రమత్తంగా ఉండకపోతే జలుబు, జ్వరాల బారిన పడేస్తాయి. ఈ కాలంలోనే పరిశుభ్రత కొరవడుతుంది. దీంతో దోమలు వ్యాప్తి చెందుతాయి. అవి కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వచ్చిపడతాయి. అయితే జ్వరం వచ్చిన వారికి ఇచ్చే ఫుడ్ డైట్ విషయంలో చాలా మంది రకరకాలుగా చెబుతుంటారు. వారు ఏం తినాలి.. ఏం తినకూడదు అనే విషయాలపై చాలా సందేహాలుంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ తినవద్దని చెబుతుంటారు. అయితే ఈ విషయంపై నిపుణులు కొన్ని విషయాలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతుంటారు. అలాంటి ఆహారం త్వరగా డైజెస్ట్ అయ్యి తక్షణమే శక్తినిస్తుంది.

అదే కోడి గుడ్లు, చికెన్, చేపలు వంటి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకుంటే అవి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పొట్టలో చికాకు, అజీర్తి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతే గానీ వాటిని తినడం వల్ల జ్వరం ఎక్కువవుతుందని, ఇతర జబ్బులు వస్తాయనేది నిజం కాదని వెల్లడించారు. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తినాలనే కోరిక కలిగితే నిరభ్యంతరంగా తినవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

శరీరానికి కార్బోహెడ్రేట్స్ తో పాటు ప్రొటీన్ కూడా అవసరమే. కాబట్టి ప్రొటీన్ పుష్కలంగా ఉండే నాన్ వెజ్ తింటే లాభమే కానీ, నష్టం ఉండదని నిపుణులు వివరించారు. జ్వరం వస్తుంటే కొందరికి వికారం, వాంతులు అవుతుంటాయి. అలాంటి సమస్యలతో బాధపడే వారు చేపలు, చికెన్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. కానీ మసాలా, కారం తగ్గించుకోవాలి. వికారం, అజీర్తి సమస్యలు కనిపిస్తే మాత్రం వెజిటేరియన్ ఫుడ్ నే తీసుకోవాలని నిపుణులు పేర్కొన్నారు. నాన్ వెజ్ లో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు, సంతృప్తికర ఆమ్లాలు, విటమిన్లు B6, B12, జింక్, సెలీనియం వంటివి అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు,మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.