Vitamin Deficiency: మళ్లీ మళ్లీ జబ్బు పడుతున్నారా.. అయితే మీలో ఈ విటమిన్ లోపం ఉండవచ్చు.. ఒక్కసారి చెక్ చేసుకోండి..

Bone Immunity: ఎముకలలో నొప్పి లేదా బలహీనత ఉంటే మన శరీరం మొత్తం నిస్సహాయంగా మారుతుంది. కాబట్టి శరీరంలో నిర్దిష్ట విటమిన్ లోపం ఉండకుండా చూసుకోవాలి. ఈ లోపం ఉంటే కనిపించే హెచ్చరికలను చాలా ఈజీగా గుర్తు పట్టవచ్చు.

Vitamin Deficiency: మళ్లీ మళ్లీ జబ్బు పడుతున్నారా.. అయితే మీలో ఈ విటమిన్ లోపం ఉండవచ్చు.. ఒక్కసారి చెక్ చేసుకోండి..
Vitamin D
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 11, 2022 | 5:50 PM

విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది సాధారణంగా సూర్యరశ్మి ద్వారా మనకు లభిస్తుంది. అయినప్పటికీ కొంత ఆహారం తినడం ద్వారా కూడా దీనిని పొందవచ్చు. ఈ ముఖ్యమైన పోషక లోపం ఉంటే అప్పుడు మన ఎముకలు దెబ్బతింటాయి. అంతే కాకుండా జలుబు, దగ్గు ఇలాంటి ఇన్ఫెక్షన్లు త్వరగా మనకు సంక్రమించే ప్రమాదం  ఎక్కువగా ఉంటుంది. మానవ శరీరం కాల్షియం, భాస్వరం సరైన ఉత్పత్తి, నియంత్రణ, శోషణకు,అలాగే దంతాలు, ఎముకల సరైన నిర్వహణకు, మీ రోగనిరోధక శక్తిని నిర్ధారించుకోవడానికి చాలా అవసరం. విటమిన్ డి వల్ల మన శరీరం ఎలాంటి ప్రయోజనాలను పొందుతుందో.. దాని లక్షణాలను ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.

విటమిన్ డి ప్రయోజనాలు

1. శరీరంలో కాల్షియం సరైన శోషణకు విటమిన్ డి సహాయపడుతుంది.

2. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా విటమిన్ డి తగ్గిస్తుంది.

3. గుండె ఆరోగ్యంగా ఉంచడంలో.. గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో విటమిన్ డి సహాయపడుతుంది.

4. శరీరంలో విటమిన్ పుష్కలంగా ఉన్నప్పుడే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా తయారవుతాయి.

5. డయాబెటిక్ పేషెంట్లకు విటమిన్ డి కూడా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

6. విటమిన్ డి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ అవయవాలను బలంగా చేస్తుంది.

7. విటమిన్ డి శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

8. విటమిన్ డి తీసుకోవడం వల్ల మెదడు, నాడీ వ్యవస్థను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

విటమిన్ డి లోపం ఉంటే లక్షణాలు ఇలా..

మన శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే శరీరం అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వైద్య పరీక్షల ద్వారా ఈ సమస్యను గుర్తించగలిగినప్పటికీ కొన్ని సంకేతాలను మన శరీరం ద్వారా కూడా కనుగొనవచ్చు.

1. విటమిన్ డి లోపం వల్ల గాయాలు ఆలస్యంగా మానిపోతాయి.

2. మీరు డిప్రెషన్, ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.

3. కండరాలలో నొప్పి ఉంటే అది విటమిన్ డి లోపం కావచ్చు.

4. విటమిన్ డి లోపం వల్ల రోజంతా నీరసంగా అనిపిస్తుంది.

5. విటమిన్ డి లోపం వల్ల ఎముకల్లో నొప్పి వస్తుంది.

6. మీ జుట్టు విపరీతంగా రాలిపోవడం లేదా తెల్లగా మారడం. అది విటమిన్ డి లోపానికి సంకేతం.

7. రోగనిరోధక శక్తి బలహీనపడటం మొదలవుతుంది. దీని కారణంగా మీరు త్వరలో అనారోగ్యానికి గురవుతారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..