Night Shift: నైట్‌షిఫ్టుల్లో పనిచేస్తున్నారా? ఆ చెడు అలవాట్లకు బానిసయ్యే ఛాన్స్.. హెచ్చరిస్తోన్న నిపుణులు
నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసే వారికి పలు అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించి ప్రముఖ సీనియర్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో-సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్ చుగ్ మాట్లాడుతూ..నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు ఎక్కువగా మాదక ద్రవ్యాలకు బానిస అయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులు తమ పనులను పూర్తి చేసేందుకు పగలు, రాత్రి శ్రమిస్తున్నారు. పోటీతో పాటు డిమాండ్ పెరుగుదల కారణంగా, కంపెనీలు 24×7 వర్క్‌ను అమలు చేస్తున్నాయి. కొంతమంది ఎప్పుడు ఓకే షిఫ్టుల్లో పని చేస్తుంటే మరికొంతమంది మాత్రం వేరే వేరే షిఫ్టులు వెళ్లాల్సి ఉంటుంది. వారానికి ఒక ఒక షిఫ్ట్ ఛేంజ్ చేస్తూనే ఉంటాయి కంపెనీ యాజమాన్యాలు. అయితే ఈ క్రమరహిత షిఫ్టులలో ఎక్కువ కాలం పని చేసే ఉద్యోగులు, ముఖ్యంగా నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసే వారికి పలు అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించి ప్రముఖ సీనియర్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో-సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్ చుగ్ మాట్లాడుతూ..నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు ఎక్కువగా మాదక ద్రవ్యాలకు బానిస అయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ‘నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేవారు, ప్రత్యేకించి షిఫ్ట్‌లు క్రమం తప్పకుండా మారుతున్న వారిలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.’
షిఫ్ట్ మార్పులతో అనారోగ్య సమస్యలు.. ‘ఉదాహరణకు మీరు ఒక వారం నైట్ షిఫ్ట్ చేస్తారు. ఆ మరుసటి వారం డే షిఫ్ట్ చేస్తారు. ఇక మూడవ వారం మధ్యాహ్నం షిఫ్ట్ చేస్తారు. ఇలా క్రమరహిత షిఫ్టుల్లో పనిచేసేవారి శరీరంలో న్యూరోకెమికల్ అలాగే శరీరం లోపల హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. సాధారణంగా సమయానికి నిద్ర పోవడం వల్ల శరీరంలో విషతుల్య పదార్థాలు బయటకు పోతాయి. ఒత్తిడి తగ్గిపోతుంది. అయితే రాత్రి షిఫ్ట్‌లో పనిచేయడం వల్ల నిద్రకు తీవ్ర భంగం కలగడంతో పాటు పై విధులకు ఆటంకం కలుగుతుంది. స్లీపింగ్ సైకిల్ దెబ్బతినడంతో పాటు సాధారణ జీవనశైలి పూర్తిగా దెబ్బతింటుంది. అస్తవ్యస్తంగా మారుతుంది’ అని చెప్పుకొచ్చారు డాక్టర్ సంజయ్.
మాదక ద్రవ్యాలకు బానిస.. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య నిద్రలేమి. రాత్రి షిఫ్ట్ చేసే ఉద్యోగుల్లో చాలామంది ఇంటికెళ్లాక నిద్రకు ఉపక్రమించేందుకు ప్రయత్నించినా నిద్ర పట్టదు. దీంతో మత్తు రావడానికి మద్యపానంతో పాటు మరికొన్ని మాదక ద్రవ్యాలను తీసుకుంటుంటారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది తాత్కాలిక పరిష్కారమైనప్పటికీ, భవిష్యత్‌లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ఆల్కహాల్ నిద్ర నాణ్యతను మరింత దిగజార్చుతుంది. దీని వలన మీరు సహజమైన నిద్ర పోలేరు. వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అయితే మెదడు, శరీరం రీఛార్జ్ అవ్వాలంటే సహజమైన నిద్ర అవసరం. ఇక నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసేవారు ధూమపానం వ్యసనానికి గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మెలకువగా ఉండేందుకు, అప్రమత్తంగా ఉండి సరిగా పనిచేసే క్రమంలో వీరు ఇతరుల కంటే రెండింతలు ఎక్కువగా స్మోకింగ్‌కు అడిక్ట్ అవతారని అధ్యయనాలు చెబుతున్నాయి. మరికొందరు మత్తు కోసం కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు కూడా బానిస అవుతారని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
గుండెపోటుతో పాటు.. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లోని 2012 అధ్యయనం ప్రకారం, నైట్ షిఫ్ట్‌లో పనిచేయడం వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఏడు శాతం పెరుగుతుంది. రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే వారికి ఈ ప్రమాదం ఎందుకు ఎక్కువ అని అధ్యయనం చెప్పలేదు. అయితే నిద్ర అలవాట్లలో మార్పు రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుందని, ఇది క్రమంగా గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక రాత్రి షిఫ్ట్‌లో పనిచేయడం వల్ల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందట. పని ఒత్తిడి, డిప్రెషన్ వంటి మూడ్ డిజార్డర్స్ తలెత్తే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. (source)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..