Lumpy Virus: రాష్ట్రాలకు వ్యాపిస్తున్న లంపి వైరస్‌ కేసులు.. ఆవు పాలు తాగడం వల్ల మనుషులు కూడా ఈ వ్యాధి వస్తుందా..?

Lumpy Virus Cases: దేశంలో వైరస్‌లో ప్రజలను పట్టిపీడిస్తుండగా, కొత్త కొత్త వేరియంట్లతో భయాందోళన కలిగిస్తున్నాయి. ఇక మనుషులకే కాకుండా పశువులకు కూడా వ్యాధులు సోకుతుండటం..

Lumpy Virus: రాష్ట్రాలకు వ్యాపిస్తున్న లంపి వైరస్‌ కేసులు.. ఆవు పాలు తాగడం వల్ల మనుషులు కూడా ఈ వ్యాధి వస్తుందా..?
Lumpy Virus Cases
Follow us
Subhash Goud

|

Updated on: Sep 13, 2022 | 3:41 PM

Lumpy Virus Cases: దేశంలో వైరస్‌లో ప్రజలను పట్టిపీడిస్తుండగా, కొత్త కొత్త వేరియంట్లతో భయాందోళన కలిగిస్తున్నాయి. ఇక మనుషులకే కాకుండా పశువులకు కూడా వ్యాధులు సోకుతుండటం ఆందోళకు గురి చేస్తోంది. దేశంలో లంపీ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ చర్మ వ్యాధి జంతువులకు సోకుతుంది. ఇప్పటివరకు దీని కేసులు 10కిపైగా రాష్ట్రాల్లో విస్తరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వైరస్‌ కేసులు రాజస్థాన్‌లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో లంపి కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ బారిన పడిన మూగ జీవాలు అల్లడిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో 55 వేలకు పైగా పశువులు మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ లంపి వ్యాధిని అంటువ్యాధిగా ప్రకటించాలని రాజస్థాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ వైరస్‌ బారిన పడిన ఆవుల్లో 8 నుంచి 10శాతం చనిపోతున్నేట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. ఒక జంతువు ఈ వ్యాధి బారిన పడితే, మరొక జంతువు కూడా దాని బారిన పడుతోంది. సోకిన ఆవు లేదా పశువుల శరీరంపై గాయం మీద వాలుతున్న ఈగ, దోమ ద్వారా ఒక జంతువు నుండి మరొక జంతువుకు వైరస్‌ వ్యాపిస్తోందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆవు పాలు తాగడం వల్ల మనుషులు కూడా ఈ వ్యాధి వస్తుందా..?

ఇప్పుడు ఆవులకు ఈ లంపి వ్యాధి సోకడంతో వాటి పాల ద్వారా ప్రజలకు కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందేమోనన్న భయాందోళన నెలకొంది. ఈ వైరస్‌ సోకిన ఆవు పాలు తాగడం ద్వారా పిల్లలు లేదా పెద్దలు కూడా ఈ వైరస్ బారిన పడతారా? అనే విషయం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన శిశువైద్యుడు డాక్టర్ అరుణ్ షా మాట్లాడుతూ.. ప్రజలు సాధారణంగా అన్ని ఇళ్లలో ఆవు పాలను మరిగించి తాగుతారని, పాలను మరిగించడం వల్ల అందులో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా లేదా వైరస్‌లు నశిస్తాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఆవు పాలను మరిగించి తాగితే ప్రమాదం ఉండదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు ఉడకబెట్టకుండా తాగితే అది పిల్లలు లేదా పెద్దలపై ప్రభావం చూపుతుంది. అయితే వారి వ్యాధి నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటే వైరస్ బారిన పడే ప్రమాదం ఉండదు అని అన్నారు. ఒక వేళ మనుషులకు ఇన్ఫెక్షన్ వచ్చినా అది జబ్బుగా మారదు. అదే సమయంలో వైరల్ లోడ్ తక్కువగా ఉన్నప్పటికీ, వ్యాధి బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు.

ఇవి కూడా చదవండి

లంపి వైరస్‌పై భయపడాల్సిన అవసరం లేదు:

ఈ వైరస్ సోకిన ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. వ్యాధి సోకిన ఆవు పాలు తాగడం వల్ల ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తుందని కాదు.. ఈ వ్యాధి మనుషులకు సోకుతుందని ఇప్పటి వరకు వైద్యపరమైన ఆధారాలు లేవు. ఆవు పాలు తాగితే మనుషులకు కూడా సోకుతుందని భయాందోళన పెట్టుకోవద్దంటున్నారు.

ఈ వైరస్‌ను ఎలా నివారించవచ్చు

వైరస్‌ నివారణ పద్ధతుల గురించి పశువైద్యాధికారి డాక్టర్‌ నర్సిరామ్‌ వివరిస్తూ.. ఈ వైరస్‌ను అరికట్టాలంటే ఆవు నివసించే ప్రాంగణంలో బయో సేఫ్టీ మెజర్స్‌ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక ఆవులో లంపీ వైరస్ లక్షణాలు కనిపిస్తే, ఆవును మంద నుండి వేరుగా ఉంచి మేత, నీరు, చికిత్స అందించారు. వైరస్‌ సోకిన ఆవు గురించి వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయండి.

లంపీ వైరస్‌ను అరికట్టడంలో గౌట్‌పాక్స్‌, షీప్‌పాక్స్‌ వ్యాక్సిన్‌ ఎంతగానో దోహదపడతాయని డాక్టర్‌ నర్సిరామ్‌ తెలిపారు. ఈ వ్యాక్సిన్ 60 శాతం వరకు ప్రభావవంతంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాక్సిన్‌తో పశువులకు టీకాలు వేయడం ఎంతో ముఖ్యం. దీనితో పాటు ఈ వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

లక్షణాల గుర్తింపుపై అవగాహన అవసరం

చాలా ప్రాంతాల్లో లంపి లక్షణాలపై అవగాహన కొరవడింది. ఈ వ్యాధి పట్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని నిపుణులు చెబుతున్నారు. ఆవు శరీరంపై దద్దుర్లు వచ్చినా, గాయమైనా వెంటనే ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలి. సరైన సమయంలో ఆవును వేరు చేయడం ద్వారా ఇతర పశువులను ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి