Lumpy Virus: రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న లంపి వైరస్‌ కేసులు.. పాల సరఫరాపై తీవ్ర ప్రభావం

Lumpy Virus: దేశంలో కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతుంటే.. కొత్త కొత్త వైరస్‌ను వ్యాపిస్తున్నాయి. మనుషులకు పట్టిపీటిస్తున్న వైరస్‌లు.. ఇప్పుడు జంతువులను..

Lumpy Virus: రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న లంపి వైరస్‌ కేసులు.. పాల సరఫరాపై తీవ్ర ప్రభావం
Lumpy Virus
Follow us
Subhash Goud

|

Updated on: Sep 12, 2022 | 6:11 PM

Lumpy Virus: దేశంలో కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతుంటే.. కొత్త కొత్త వైరస్‌ను వ్యాపిస్తున్నాయి. మనుషులకు పట్టిపీటిస్తున్న వైరస్‌లు.. ఇప్పుడు జంతువులను పీడిస్తున్నాయి. దేశంలో లంపీ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ చర్మ వ్యాధి జంతువులకు సోకుతుంది. ఇప్పటివరకు దీని కేసులు 10కిపైగా రాష్ట్రాల్లో వ్యాపించింది. రాజస్థాన్‌లో అత్యంత భయంకరంగా వ్యాపిస్తో్ంది. ఈ రాష్ట్రంలో లంపి కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో 55 వేలకు పైగా పశువులు చనిపోయాయి. దీని నివారణకు కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పశువుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. లంపి డిసీజ్‌ను అంటువ్యాధిగా ప్రకటించాలని రాజస్థాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న ఈ వ్యాధి కేసులు ఇప్పుడు పెద్ద ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.

ఆవుల్లో చాలా వరకు లంపి చర్మవ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధి ఆవులకు వేగంగా సోకి వాటి మరణానికి కారణమవుతోంది. లంపి వ్యాధి నెమ్మదిగా అంటువ్యాధిలా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడిన ఆవుల్లో 8 నుంచి 10శాతం చనిపోతున్నేట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. ఒక జంతువు ఈ వ్యాధి బారిన పడితే, మరొక జంతువు కూడా దాని బారిన పడుతోంది. సోకిన ఆవు లేదా పశువుల శరీరంపై గాయం మీద వాలుతున్న ఈగ, దోమ ద్వారా ఒక జంతువు నుండి మరొక జంతువుకు వైరస్‌ వ్యాపిస్తోందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు.

ఢిల్లీలోనూ లంపి వైరస్‌ కేసులు 173 నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇదిలా ఉండగా, లంపి భయంతో రాజస్థాన్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాల వినియోగం తగ్గింది. ఈ వైరస్ భయంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పాలు తాగేందుకు భయాందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

పాల సరఫరాపై ప్రభావం..

కొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా డెయిరీల వద్ద పాలు, నెయ్యి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆవు పాలు తాగితే ఈ వ్యాధి సోకుతుందని భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు దీనిపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాజస్థాన్‌లోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో లంపి వ్యాధి భయం ఉంది. వ్యాధి సోకిన ఆవుల భయంతో పాల వినియోగం కూడా తగ్గిపోయింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి