Heart Attack: హార్ట్ ఎటాక్ బాధితులకు అలర్ట్‌.. DJ పౌండ్‌తో ఆకస్మిక గుండెపోటు.. సౌండ్‌కు గుండెకు సంబంధం ఏమిటి..? అధ్యయనంలో సంచలన విషయాలు

Heart Attack: గత కొన్నేళ్లుగా గుండెపోటు బారిన పడే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని నెలలుగా, 'సడన్ హార్ట్ ఎటాక్' రావడం పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఆకస్మిక గుండెపోటు..

Heart Attack: హార్ట్ ఎటాక్ బాధితులకు అలర్ట్‌.. DJ పౌండ్‌తో ఆకస్మిక గుండెపోటు.. సౌండ్‌కు గుండెకు సంబంధం ఏమిటి..? అధ్యయనంలో సంచలన విషయాలు
Heart Attack
Follow us
Subhash Goud

|

Updated on: Sep 11, 2022 | 8:32 AM

Heart Attack: గత కొన్నేళ్లుగా గుండెపోటు బారిన పడే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని నెలలుగా, ‘సడన్ హార్ట్ ఎటాక్’ రావడం పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఆకస్మిక గుండెపోటు కేసులు పెరుగుతుండడం చాలా ఆందోళన కలిగిస్తోందని గుండె వైద్యులు చెబుతున్నారు. ఈ రోజుల్లో కోవిడ్ మహమ్మారికి తర్వాత గుండె జబ్బులు లేని వారిలో కూడా ఆకస్మిక గుండెపోటు సమస్య కనిపిస్తుంది. గతంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. అయితే డీజేలో డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా గుండెపోటు వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. DJ లేదా బిగ్గరగా ఉండే బేస్‌ శబ్దం గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. దీని కారణంగా ఆకస్మిక గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. సడన్ హార్ట్ ఎటాక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

పెద్ద శబ్దం గుండెపోటును ఆహ్వానిస్తుందా?

గుండె సంబంధిత సమస్య ఉన్నవారు డీజేలు గానీ, ఇతర పెద్ద శబ్దాలు వచ్చే ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ డీజే సౌండ్‌లతో గుండెపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల సడన్‌గా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందుకే దూరంగా ఉండటం మంచిది. యువకులకు అలాంటి అవకాశాలు లేవు. కానీ ఇప్పటికీ వారికి గుండెపోటు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు కార్డియో పల్మనరీ రిససిటేషన్ (CPR) ఇచ్చినట్లయితే చాలా మంది ప్రాణాలను రక్షించవచ్చు. CPR ఇచ్చే ప్రక్రియలో ఒక వ్యక్తి ఛాతీని రెండు చేతులతో నొక్కడం వల్ల శ్వాస తీసుకోవడంలో కొంత వరకు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

పెద్ద శబ్దాలు ప్రమాదకరం

DJ లేదా లౌడ్ స్పీకర్ల పెద్ద శబ్దం కొన్నిసార్లు ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇది అనేక పరిశోధనలలో కనుగొన్నారు పరిశోధకులు. అకస్మాత్తుగా పెరుగుతున్న శబ్దం మీ హృదయ స్పందనను పాడు చేస్తుంది. ఇటువంటి పరిస్థితిని వైద్య శాస్త్ర భాషలో కర్ణిక దడ అని కూడా అంటారు. దీని కారణంగా రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు.

ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..

వైద్యుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్కువసేపు పెద్ద శబ్దాల మధ్య ఉండే వ్యక్తుల ఆరోగ్యానికి మంచిది కాదు. DJ శబ్దాల నుండి వెలువడే శబ్దం తరంగాలు గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గుండెపైనే కాకుండా చెవులపై కూడా ఎఫెక్ట్‌ ఉంటుందని, ఈ శబ్దాలు తీవ్రమైన హాని కలిగిస్తుంది.

కరోనా తర్వాత జాగ్రత్త అవసరం

కరోనా ఇన్ఫెక్షన్ నుండి అనేక గుండె సంబంధిత వ్యాధులు ప్రజలను చుట్టుముట్టాయి. చాలా మంది కోవిడ్ -19 వచ్చి వ్యాధి నయమైన చాలా మందికి గుండె సంబంధిత వ్యాధి ఉందని కూడా తెలియదు. కరోనా బాధితులుగా మారిన వారు ఎప్పటికప్పుడు తమ గుండెను పరీక్షించుకోవాలి. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. దీనితో పాటు, ధూమపానం నుండి దూరంగా ఉండటం ముఖ్యం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి