Aloe Vera Danger: కలబంధను కట్ చేసిన వెంటనే దీనిని తీసేయండి.. లేదంటే పెను ప్రమాదం తప్పదు..

Aloe Vera Danger: అలోవెరా హానికరం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అనేక ఔషధాలు, కాస్మోటిక్స్‌లలో కలబందను వినియోగిస్తారనే విషయం మనందరికీ తెలసిందే.

Aloe Vera Danger: కలబంధను కట్ చేసిన వెంటనే దీనిని తీసేయండి.. లేదంటే పెను ప్రమాదం తప్పదు..
Aloe Vera
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 11, 2022 | 7:00 AM

Aloe Vera Danger: అలోవెరా హానికరం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అనేక ఔషధాలు, కాస్మోటిక్స్‌లలో కలబందను వినియోగిస్తారనే విషయం మనందరికీ తెలసిందే. అయితే, ఈ కలబందను సరిగ్గా ఉపయోగించకపోతే అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కలబందలో ఔషధ గుణాలు ఉన్నట్లుగానే, విషపూరితమైన లక్షణాలు కూడా ఉన్నాయంటున్నారు. అవును, కలబందను కట్ చేస్తే వచ్చే పచ్చని సొన చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు. అందుకే కలబందను కట్ చేసిన తరువాత ఆ పచ్చ సొనను తీసేయాలని, అది తీసేయకుండా వినియోగిస్తే ప్రమాదం అని చెబుతున్నారు. మరం ఆ పచ్చ సొనను ఎలా తీసేయాలి? కలబంద జెల్‌ను ఎక్కువ కాలం ఎలా నిల్వ చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం..

కలబందలో మూడు పొరలు.. కలబందలో మూడు పొరలు ఉంటాయి. మొదటి పొర కండ కలిగి ఉంటుంది. ఇది బయటికి మురికిగా కనిపిస్తుంది. మధ్య పొరను రబ్బరు పాలు అంటారు. ఆకులను తీయగానే అక్కడ ఉన్న అలోయిన్ పసుపు రంగులో కనిపిస్తుంది. చివరి పొర పారదర్శకంగా శ్లేష్మం (జెల్) ఉంటుంది. ఇది ఒక గుజ్జు.

అలోయిన్ డేంజర్.. అలోయిన్(పచ్చ సొన)ను తీసుకుంటే కడుపులో తిమ్మిర్లు, అతిసారం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే కలబందను ఉపయోగించేప్పుడు దానిని తప్పనిసరిగా తొలగించాలి.

ఇవి కూడా చదవండి

కలబంద నుండి అలోయిన్ పొరను ఎలా తొలగించాలి.. అలోవేరా ఆకును నీటితో కడగాలి. ఆ తరువాత ఆకు దిగువ పొరను కట్ చేయాలి. ఇప్పుడు ఆ ఆ భాగాన్ని ఒక గ్లాస్ నీటిలో ముంచి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత శుభ్రమైన గుడ్డ లేదా టిష్యూతో క్లీన్ చేయాలి. దీని తరువాత, కత్తి సహాయంతో ముళ్ళ పొరను తొలగించడం ద్వారా ఉపయోగించొచ్చు.

ఎలా నిల్వ చేయాలి.. కలబంద ఆకుల నుంచి ఒక చెంచా సాయంతో గుజ్జును తీయాలి. ఆ గుజ్జును మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. దానిని ఐస్ క్యూబ్ ట్రేలో పెట్టాలి. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసి డీఫ్రాస్ట్ చేసి ఉపయోగించొచ్చు.

కలబంద రసం ప్రయోజనాలు..

  1. కలబంద జ్యూస్ తాగడం వలన డీహైడ్రేషన్ సమస్య తొలగిపోతుంది.
  2. రక్తంలో చక్కెర స్థాయిలు, కొవ్వును కూడా తగ్గిస్తుంది.
  3. జీర్ణక్రియలో ప్రయోజనకరంగా ఉంటుంది.
  4. బెడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
  5. కడుపులో గ్యాస్ సమస్యను దూరం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?