Period Pain మహిళల్లో చాలా మందికి నెలసరి రుతుక్రమంలో నొప్పి ఎందుకు వస్తుంది..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Period Pain: మహిళలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించేందుకు మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. సాధారణంగా మహిళల్లో చాలా మందికి నెలవారీ..
Period Pain: మహిళలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించేందుకు మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. సాధారణంగా మహిళల్లో చాలా మందికి నెలవారీ రుతుక్రమం సమయంలో నొప్పి వస్తుంటుంది. ఆ సమయంలో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నొప్పి పొత్తికడుపు కండరాలు పట్టేసినట్లుగా ఉంటుంది. ఆ నొప్పి అక్కడి నుంచి వీపు భాగానికి, తోడలకు, కాళ్లు, శరీరంలో ఇతర భాగాలకు వ్యాపిస్తుంటుంది. దీని వల్ల మహిళలు ఆ సమయంలో నరకం అనుభవించాల్సి వస్తుంటుంది. పీరియడ్ సమయంలో ఈ నొప్పి ఓ మాదిరిగా ఉంటుంది. ఈ నొప్పి సమయంలో తలనొప్పి, వాంతులు అవుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. అయితే పీరియడ్ సమయంలో ఈ నొప్పి అందరికి ఒకేలా ఉండదు. ఒక్కో మహిళలకు ఒక్కోలా విధంగా ఉంటుంది. ఈ నొప్పిలో చాలా తేడాలు ఉంటాయి.
పీరియడ్ సమయంలో నొప్పి ఎందుకు వస్తుంటుంది..?
స్త్రీవైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..మహిళల్లో 30 నుంచి 50 శాతం వరకు పీరియడ్స్ నొప్పిగా ఉంటుంది. కొందరికి నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో అది వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లీండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన డాక్టర్ కేవీ విన్సెంట్ నుఫీల్డ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ విభాగంలో మహిళల్లో పీరియడ్స్ సమయంలో నొప్పిపై పరిశోధన చేశారు. నెలసరి సమయంలో మహిళల్లో రక్తం బయటకు వెళ్లడానికి వీలుగా గర్భసంచి కుచించుకుపోతుంది, ఆ సమయంలో చ ఆలా మంట, వాపు కూడా ఉంటుంది. గర్భసంచి కణజాలం నొప్పిని కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది. అందుకే నొప్పి ఉంటుందని తెలిపారు. పీరియడ్స్ సమయంలోప్రొస్టాగ్లాండైన్లు విడుదలవుతాయి. ఈ నెలసరి సమయంలో అధికంగా ఉత్పత్తి అవుతాయి. నెలసరి సమయంలో గర్భసంచి కండరాలు సంకోచించేలా చేస్తాయి. దానికి ప్రతిస్పందనగా కలిగే నొప్పి వెనుకా వీటి పాత్ర ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో నొప్పి, మంట పెరిగేందుకు ప్రొస్టాగ్లాండైన్ల పాత్ర ఎంతో ఉంటుందని పరిశోధనలలో తేలినట్లు ఆమె అన్నారు.
నెలసరి సమయంలో మహిళలు పెయిన్ రిలీవర్లు, యాంటీ-ఇన్‌ప్లమేటరీలు వంటి మందుల ద్వారా కొంత ఉపశమనం కలిగించవచ్చని అంటున్నారు. గర్భసంచి లోపల కానీ, చుట్టు ప్రాంతంలో కణుతులు క్యాన్సర్‌ను కలిగించవు. కానీ వీటి వల్ల పీరియడ్స్ సమయంలో బాధకరంగా ఉంటుందని అన్నారు.
నొప్పి నివారణకు మందులు వేసుకోవడం..
అమెరికన్ నేషనల్ లైబ్రేరీ ఆఫ్ మెడిసిన్ వివరాల ప్రకారం.. రుతుక్రమం సమయంలో మహిళలకు నొప్పిని నివారించేందుకు రకరకాల మందులను వాడుతుంటారు. దీంతో మందులు వాడటం వల్ల ఆ ప్రాతంలో బ్యాక్టీరియా తొలగిపోతుంది. కానీ అలా మందులను వాడటం భవిష్యత్తులో మూత్రపిండాలు, కాలేయం, గుండె సంబంధిత సమస్యకు దారి తీసే అవకాశం ఉందంటున్నారు. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వంటింటి చిట్కాలు ఉపయోగిస్తే బాగుంటుందని, నోటిలో రెండు లవంగాలు, రెండు ఏలకులు వేసుకోవడం వల్ల తక్షణమే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు.
మహిళలు చేసే తప్పులు ఇవే..
మహిళలు పీరియడ్స్ సమయంలో నొప్పి కలుగడం సాధారణమైన విషయమే. అయితే ఆ ప్రాంతం వద్ద నీటితో శుభ్ర పర్చుకోవడంతో పాటు సబ్బులు, జల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇటువంటి ఉత్పత్తుల్లో ఉండే రసాయనం వల్ల ఆ ప్రాంతంలో చర్మం దెబ్బతిని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
నొప్పి సమయంలో పండ్లతో పాటు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. అవకాడో, పీనట్ బటర్, శనగలు, అరటిపండ్లు, కర్జూజ, బెర్రీస్, దోసకాయ వంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే స్నానం చేసే ముందు వేడిగా ఉండే నీటిని వాడటం మంచిది. ప్రైవేటు పార్ట్‌లో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ కాకుండా నొప్పి కూడా తగ్గే అవకాశాలున్నాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి