AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudden Heart Attack: అకస్మాత్తుగా గుండెపోటు వస్తే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడుకోండి..!

Sudden Heart Attack: ఇటీవల గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. జీవనశైలి కారణంగా గుండెపోటు బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి, తినే ఆహారం, జీవనశైలి..

Sudden Heart Attack: అకస్మాత్తుగా గుండెపోటు వస్తే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడుకోండి..!
Sudden Heart Attack
Subhash Goud
|

Updated on: Sep 10, 2022 | 12:18 PM

Share

Sudden Heart Attack: ఇటీవల గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. జీవనశైలి కారణంగా గుండెపోటు బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి, తినే ఆహారం, జీవనశైలి తదితర కారణాల వల్ల గుండెకు సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి. కొందరు ఎంతో ఫిట్‌గా ఉన్నా గుండెపోటు సంభవించి మరణానికి చేరువవుతున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో ఓ కళాకారుడు స్టేజ్ ప్రదర్శనలో గుండెపోటుతో మరణించాడు. 20 ఏళ్ల యువకుడు డాన్స్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో గణేష్ చతుర్థి సందర్భంగా ఒక కళాకారుడు స్టేజీపై డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత కొద్ది కాలంగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన కొద్ది క్షణాల్లోనే మరణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆశ్చర్యకర విషయం ఏంటంటే 20 నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువతలో గుండెపోటు ఎక్కువ సంభవిస్తున్నాయి.

గుండె కేసులు ఎందుకు పెరుగుతున్నాయి

ఇవి కూడా చదవండి

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. శరీరం అంతటా ఆక్సిజన్, రక్తాన్ని సరఫరా చేయడం దీని పని. ఇది మిగిలిన అవయవాలను సజీవంగా ఉంచే విధంగా పనిచేస్తుంది. గత కొన్నేళ్లుగా గుండె జబ్బులు, గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో గుండె, మధుమేహం, హైపర్‌టెన్షన్, గుండె జబ్బులు వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయని, అయితే ప్రస్తుతం యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారని, దీనివల్ల చాలా చిన్న వయసులోనే మరణిస్తున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కొరవడింది. ఒక నివేదిక ప్రకారం.. దేశంలో 50 శాతం మంది గుండెపోటు రోగులు సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడం లేదు. చాలా సార్లు ప్రజలు గుండె జబ్బుల లక్షణాలను విస్మరిస్తారు. ఛాతీలో నొప్పి అంటే గ్యాస్ వల్ల కలిగే నొప్పి వస్తుందని నిర్లక్ష్యం చేస్తున్నానరు. దీని కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రఖ్యాత సర్జన్, మేదాంత ఛైర్మన్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ మీడియాతో మాట్లాడుతూ కరోనా తర్వాత చాలా మందిలో రక్తంలో మార్పులు వస్తున్నాయి, గుండె ధమనులలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దీని కారణంగా గుండెపోటు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు.

కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బు ఉంటే, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారికి కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్ పేషెంట్లలో గుండెపోటు ఎక్కువగా వస్తుంది. అంతే కాకుండా యువతలో వచ్చే హైపర్ టెన్షన్ వ్యాధి కూడా గుండెపోటుకు కారణంగా మారుతోంది. అధిక బరువు, ఊబకాయం, సిగరెట్లు, మద్యం, మత్తుపదార్థాల వినియోగం గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఆహారం, ఒత్తిడి గుండెపోటు ప్రమాదాన్ని పెంచడానికి ప్రధాన కారణాలు అని అన్నారు.

గుండెపోటు లక్షణాలను గుర్తించండి:

ఈ వ్యాధిని నివారించడానికి ప్రతి ఒక్కరూ దాని లక్షణాలను గుర్తించగలగాలి. ఛాతీ నొప్పి వంటి గుండెపోటు లక్షణాలను చాలా సార్లు ప్రజలు గ్యాస్ నొప్పిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే మీరు ఈ వ్యాధి లక్షణాలను బాగా గుర్తించడం చాలా ముఖ్యం. ఛాతీలో నొప్పి అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. గుండెపోటు సమయంలో వచ్చే నొప్పి గ్యాస్ లేదా ఇతర వ్యాధి నొప్పికి భిన్నంగా ఉంటుంది. దీనిలో ఛాతీపై ఒత్తిడి, బిగుతు లేదా ఎవరైనా పిండినట్లు అనిపించవచ్చు. ఈ నొప్పి, అసౌకర్యం భుజాలు, చేతులు, వీపు, మెడ, శరీరంపై భాగాలకు వ్యాపిస్తుంది. ఇక జలుబు చెమటలు, అలసట, అశాంతిగా అనిపించడం, వాంతులు, మైకము, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే కూడా జాగ్రత్తగా ఉండాలి.

గుండెపోటు లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి:

ఒక వ్యక్తికి గుండె జబ్బులు, అకస్మాత్తుగా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే తన కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారికి, అంబులెన్స్‌కు కాల్ చేయాలి. ఆకస్మిక గుండెపోటు లక్షణాల విషయంలో మీరు ఇంట్లో ఉన్న ఆస్పిరిన్ (డిస్ప్రిన్) టాబ్లెట్‌ను వేసుకోవచ్చట. ఒక వ్యక్తి మీ ముందు ఈ లక్షణాలను చూసినట్లయితే, మీరు అతని ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ సమయంలో CPR సహాయం తీసుకోవచ్చు. CPR అనేది చేతితో ఛాతీపై పదేపదే ఒత్తిడి చేయబడే ప్రక్రియ. తద్వారా దాని రక్త ప్రసరణ కొనసాగుతుంది. ఇది కాకుండా గుండెపోటు సంభవించినప్పుడు వ్యక్తికి ప్రాథమిక లైఫ్ సపోర్ట్, అధునాతన లైఫ్ సపోర్ట్ ఇవ్వడం కూడా ప్రయోజనం పొందవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి