Health: గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ఉడికించేటప్పుడు పగిలిపోతున్నాయా.. అప్రమత్తంగా ఉండాల్సిందే..

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది గుడ్డు (Egg) మాత్రమే. ఫ్రై చేసుకున్నా, ఆమ్లెట్ వేసుకున్నా, కూర వండుకున్నా, పులుసు పెట్టుకున్నా ఆ రుచికి దాసోహం అవ్వాల్సిందే. రుచే...

Health: గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ఉడికించేటప్పుడు పగిలిపోతున్నాయా.. అప్రమత్తంగా ఉండాల్సిందే..
Eggs Storage Tips
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 09, 2022 | 9:54 PM

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది గుడ్డు (Egg) మాత్రమే. ఫ్రై చేసుకున్నా, ఆమ్లెట్ వేసుకున్నా, కూర వండుకున్నా, పులుసు పెట్టుకున్నా ఆ రుచికి దాసోహం అవ్వాల్సిందే. రుచే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉండే గుడ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గుడ్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఏదో ఒక రూపంలో గుడ్డును ఆహారంలో భాగం చేసుకుని లాగించేస్తున్నారు. అయితే మనం తీసుకునే గుడ్లు మంచివేనా.. షాపులో మనకు తాజాగా ఉన్న గుడ్లనే ఇస్తున్నారా.. నకిలీ గుడ్లను ఎలా కనిపెట్టాలనే అనుమానాలు మీకు వచ్చే ఉంటాయి. అయితే వాటికి నిపుణులు (Health Experts) ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా డజన్, ట్రే గుడ్లను ఒక్కసారే తెచ్చుకుంటాం. వాటిని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటాం. అయితే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. గుడ్డును గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే వారం నుంచి పది రోజుల్లోపు దాన్ని ఉపయోగించాలి. అదే ఫ్రిజ్‌లో ఉంచితే 30 నుంచి 40 రోజుల మధ్యలో వాడేయాలి. ఫ్రిజ్ లో గుడ్లు పెట్టేందుకు ప్రత్యేకంగా ట్రే ఉంటుంది. అది డోర్ వైపు ఉంటుంది కాబట్టి బయటి ఉష్ణోగ్రతను త్వరగా గ్రహించే అవకాశం లేకపోలేదు. డోర్ తెరుస్తూ ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు కూడా మారుతుంటాయి. అందుకే వాటిని డోర్ వద్ద ఉండే ట్రేలో కాకుండా లోపల పెట్టడం ఉత్తమం.

ఒక్కోసారి గుడ్లను ఉడికించే సమయంలో అది పగిలిపోతుంది. తెల్ల సొన బయటకు వచ్చేస్తుంది. అలాంటి సమస్యను ఎదురవకుండా ముందే గుడ్డు పాడయిందో లేదో అని చూసుకోవాలి. గుడ్లను నీటిలో వేస్తే అది అడ్డంగా మునిగితే తాజాగా ఉందని, నీటిలో పూర్తిగా, కాస్త వంచినట్లుగా మునిగితే పాడైపోయిందని అర్థం. అంతే కాకుండా గుడ్డును చెవి దగ్గర ఉంచి దాన్ని షేక్ చేయాలి. ఇలా ఊపినప్పుడు శబ్దం ఎక్కువగా వస్తే దాన్ని ఆహారంగా తీసుకోకూడదు. గుడ్డు ఎంత పాతదైతే దానిలో అంత గాలి చేరుతుంది. ఫలితంగా అందులోని తెలుపు, పసుపు సొనలు ఎక్కువగా కదలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శబ్దం ఎక్కువగా వస్తుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధ్రువీకరించడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..