Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Health: జుట్టు ఊడిపోయి రాలిపోతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే బలమైన కురులు మీ సొంతం..

తలపై నలుపు రంగులో అందంగా కనిపించే కురులు ఒక్కొక్కటిగా ఉడిపోతుంటే ఆ మానసిక వేదన మాటల్లో వర్ణించలేనిది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యకు పరిష్కారం దొరకక లోలోపల కుమిలిపోయే నవయువకులు ఎందరో....

Hair Health: జుట్టు ఊడిపోయి రాలిపోతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే బలమైన కురులు మీ సొంతం..
Hair Loss
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 12, 2022 | 1:48 PM

తలపై నలుపు రంగులో అందంగా కనిపించే కురులు ఒక్కొక్కటిగా ఉడిపోతుంటే ఆ మానసిక వేదన మాటల్లో వర్ణించలేనిది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యకు పరిష్కారం దొరకక లోలోపల కుమిలిపోయే నవయువకులు ఎందరో.. అందుకే అందమైన జుట్టు కోసం చాలా మంది రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. మారిపోయిన జీవనశైలి, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో జుట్టు రాలిపోతోంది. మార్కెట్లో దొరుకుతున్న రకరకాల షాంపూలు, నూనెలు, క్రీములు వాడుతూ సమస్యను మరింత జటిలం చేసుకుంటున్నారు. రసాయనాల జోలికి వెళ్లకుండా ఇంట్లోని పదార్థాలతోనే కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌, ఒత్తిడి, కెమికల్స్ ఉండే హెయిర్‌ ఉత్పత్తులు వాడటం వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అలాంటప్పుడు తులసి ఆకులు, మందార ఆకులను గిన్నెలో వేసి నీరు రంగు మారేంత వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి వారానికి ఒకసారి చొప్పున తలకు పెట్టుకుని మసాజ్‌ చేయాలి. నీటిలో టీపొడి వేసి దానిలో తులసి ఆకులు వేసి మరిగించాలి. దానికి సాధారణ షాంపూ కలిపి తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.

జుట్టు రాలడాన్ని నివారించడంలో కలబంద అద్భుతంగా పని చేస్తుంది. కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడి చేసి, చల్లార్చి కలబంద పేస్ట్ కలపాలి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేయాలి. అంతే కాకుండా నిమ్మకాయల నుంచి రసం తీసి రెండు కప్పుల నీటిలో కలిపి ఒక సీసాలో పెట్టుకోవాలి. దీన్ని నిత్యం జుట్టుకు రాసుకుంటూ ఉండాలి. ఉల్లిలో ఉండే సల్ఫర్‌ జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అన్ని సమస్యలకు వేపాకు మంచి పరిష్కారం చూపిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. వేపాకుల్ని గిన్నేలో వేసి నీరు పోసి బాగా మరిగించాలి. తర్వాత బాగా చల్లార్చి వడగట్టి ఈ నీటితో తలస్నానం చేయాలి.

తలస్నానం చేసేటప్పుడు జట్టుకు షాంపూ రాసి బలంగా రుద్దకూడదు. వేడి నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి. అవకాడో, బెర్రీలు, క్యారట్‌, బీట్‌ రూట్‌, మష్‌రూం, అరటిపండు, గుడ్లు, ఓట్స్‌ వంటి బీటా కెరోటిన్‌ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం