Viral: కంపెనీలో ఒక్కసారిగా స్పృహ తప్పిన 16 మంది మహిళా ఉద్యోగులు.. రీజన్ ఏంటంటే..?
దోమలన్నీ చనిపోవాలని మందు కాస్త ఎక్కువేశారు. దోమలు సంగతి పక్కనపెడితే ఆ డోస్ ఎక్కువయ్యి.. అక్కడున్న మహిళా ఉద్యోగులు.. స్పృహ తప్పి పడిపోయారు.

Greater Noida: గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్ 3 పోలీస్ స్టేషన్(Ecotech 3 police station) పరిధిలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కంపెనీకి చెందిన 16 మంది మహిళా ఉద్యోగులు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. ఇందుకు రీజన్ దోమల మందు. అవును కంపెనీలో దోమలను నిర్మూలించేందుకు పిచికారీ చేసిన దోమల మందు డోస్ ఎక్కువవ్వడంతో వీరంతా స్పృహ తప్పారు. దీంతో కంపెనీ ఆవరణలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆదివారం ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీంతో వెంటనే అలర్టైన మిగిలిన ఉద్యోగులు వారిని.. సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న మహిళల బంధువులు కంపెనీ యాజమాన్యంపై భగ్గుమన్నారు. ఆ మాత్రం సోయి లేకుండా ప్రాణాలతో చెలగాటమాడుతారా అంటూ ఫైర్ అయ్యారు. బాధిత మహిళల కుటుంబసభ్యుల ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. దోమల పోవడం తర్వాత ఇలాంటి పనులు చేసేప్పుడు ముందు మనుషుల ప్రాణాల మీదకు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి