Amaravati: “మున్సిపాలిటీ వద్దు.. క్యాపిటల్ సిటీ కావాలి”.. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత

అమరావతి (Amaravati) మున్సిపాలిటి ఏర్పాటుపై వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. గ్రామాల్లో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఒక్కరిద్దరు తప్పితే చాలా మంది మున్సిపాలిటీకి..

Amaravati: మున్సిపాలిటీ వద్దు.. క్యాపిటల్ సిటీ కావాలి.. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత
Amaravati Farmers
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 14, 2022 | 7:28 AM

అమరావతి (Amaravati) మున్సిపాలిటి ఏర్పాటుపై వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. గ్రామాల్లో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఒక్కరిద్దరు తప్పితే చాలా మంది మున్సిపాలిటీకి నో అని చెబుతున్నారు. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తోంది. రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలంలోని 22 గ్రామాలు, దొండపాడు, లింగాయపాలెం, ఉద్దండరాయుపాలెంలో అధికారులు తొలి విడతలో గ్రామసభ నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గ్రామసభకు హాజరైన వారిలో 90 శాతం మంది మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకించారు. కొందరు మాత్రమే అధికారుల ప్రతిపాదనను స్వాగతించారు. మరోవైపు ఉద్ధండరాయునిపాలెంలో మున్సిపాలిటీ (Municipality) ఏర్పాటును గ్రామస్థులు ఏకగ్రీవంగా తిరస్కరించారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 29 గ్రామాలతో కూడిన క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేయాలని కోరారు . ఇక దొండుపాలెం గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు అధికారులను ప్రశ్నలతో నిలదీశారు. రాజధాని పరిధిలోని 19 గ్రామ పంచాయతీలతో నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రయత్నించింది.

మున్సిపాలిటీ కాకుండా 29 పంచాయతీలతో కలిపి నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దాదాపు ఏడు నెలల తరువాత మళ్లీ ఇప్పుడు రాజధాని పరిధి తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలతో కలిపి అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి నుంచి అరసవిల్లి వరకు రైతులు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో రాజధాని పరిధిలోని 22 పంచాయతీలతో అమరావతిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను వైసీపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. రాజధాని పరిధిలోని 19 గ్రామ పంచాయతీలతో నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రయత్నించింది.

అమరావతి రాజధానిని ధ్వంసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని రాజధాని గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు వివిధ రూపాల్లో ప్రభుత్వం నిర్ణయాలను ఎదుర్కొంటున్నారు. రాజధాని అమరావతికి మద్దతుగా గతంలో నిర్వహించిన అమరావతి నుంచి తిరుమల పాదయాత్ర విజయవంతం కావడంతో ఈ నెల 12 నుంచి అమరావతి నుంచి అరసవల్లికి పాదయయాత్ర – 2 నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..