Hyderabad: ఆపదలో ఉన్నాడని సహాయం చేస్తే అంతమొందించాడు.. గుంత తవ్వించి అదే గుంతలో పూడ్చిపెట్టాడు..
స్నేహితుడు ఆపదలో ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని ఇతరుల నుంచి డబ్బు తీసుకొచ్చి మరీ సహాయం చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఇస్తానని నమ్మించి ఇనుప...
స్నేహితుడు ఆపదలో ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని ఇతరుల నుంచి డబ్బు తీసుకొచ్చి మరీ సహాయం చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఇస్తానని నమ్మించి ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పటాన్ చెరు పరిధిలోని గౌతంనగర్ కాలనీలో సలీం అనే వ్యక్తి తన కుటుంబంలో కలిసి నివాసముంటున్నాడు. ఆయన ఆర్టీసీ లో విజిలెన్స్ విభాగంలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. అతనికి మహ్మద్ సమీర్ అహ్మద్ కుమారుడు ఉన్నాడు. సమీర్ కు షేక్ ఇలియాస్ తో పరిచయం ఏర్పడింది. ఇది వారి మధ్య సాన్నిహిత్యంగా మారింది. ఇలియాస్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇదే విషయాన్ని సమీర్ తన ఇంట్లో చెప్పాడు. వారు మరో వ్యక్తి వద్ద నుంచి రూ.50 వేలు ఇప్పించాడు. డబ్బు తీసుకునే సమయంలో మూడు నెలల్లో ఇస్తానని ఇలియాస్ చెప్పాడు. అయితే నగదు తీసుకుని మూడు నెలలు గడిచిపోయాయి. అయినప్పటికీ ఇలియాస్ డబ్బు ఇవ్వలేదు. దీంతో డబ్బు ఇవ్వాలని సమీర్ పలు మార్లు అడిగాడు. దీన్ని అవమానంగా భావించిన ఇలియాస్ తన బావమరిది రుస్తుం అలీ, స్నేహితుడు అల్లావుద్దీన్‌తో కలిసి సమీర్‌ను హత్య చేయాలని కుట్ర పన్నాడు.
ముందస్తు ప్లాన్ ప్రకారం పటాన్‌చెరు శివారులో ఇద్దరు కూలీలతో గుంత తవ్వించాడు. ఈ విషయాన్ని ఇలియాస్ సమీర్‌కు చెప్పాడు. దీంతో సమీర్ గుంతను మరింత పెద్దగా తవ్వాడు. ఆ తర్వాతి రోజు ఇలియాస్ సమీర్ కు ఫోన్ చేసి, నిన్న తవ్విన గుంతను పూడ్చేయాలని చెప్పాడు. స్నేహితుడి మాటలు నమ్మి, గుంతను పూడ్చేందుకు సమీర్ లోపలికి దిగాడు. ఇదే అదనుగా భావించిన అల్లావుద్దీన్ ఇనుపరాడ్డుతో సమీర్ తలపై గట్టిగా కొట్టాడు. గ్రానైట్ రాళ్లను మీద పడేశారు. అందరూ కలిసి మట్టిపోసి మృతదేహాన్ని పూడ్చి పెట్టేశారు. అనంతరం ఏమీ జరగనట్లు ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. కుమారుడు కనిపించకపోవడంతో అతని తండ్రి ఇలియాస్ ను అడిగాడు. అతను అనుమానాస్పదంగా సమాధానమివ్వడంతో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం