Hyderabad: వేట కొడవలితో వెంటాడి నిండు గర్భిణిని నరికి చంపిన ఆడపడుచు భర్త.. రీజన్ ఇదే..
కొడవలి చూడగానే స్రవంతి కేకలు వేస్తూ పరిగెత్తబోయింది. కానీ నిండు గర్భిణి అనే జాలి కూడా లేకుండా ఆమె తల వెనుకభాగం, భుజం మీద దాడిచేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు శ్రీరామకృష్ణ.
హైదరాబాద్ లో నిండు గర్భిణీ దారుణ హత్యకు గురైంది. వేటకొడవలితో నరికి చంపాడు ఆడపడుచు భర్త. తన భార్యతో తనపై కేసు పెట్టించారనే కోపంతో వేటకొడవలితో నరికి చంపాడు. గచ్చిబౌలిలో ఈ హత్య జరిగింది. వెంకటరామకృష్ణను చంపడానికి వేటకొడవలితో వచ్చాడు శ్రీ రామకృష్ణ. అయితే ఇంట్లో రామకృష్ణ లేకపోవడంతో భార్య స్రవంతిపై దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. హత్యకు పాల్పడిన నిందితుడు శ్రీరామకృష్ణ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. ఈస్ట్ గోదావరి(East godavari) జిల్లా రాజమండ్రి(Rajahmundry)కి చెందిన వెంకటరామకృష్ణ తన వైఫ్ స్రవంతి (32)తో కలిసి కొంతకాలం క్రితం నగరానికి వచ్చారు. వీరికి 10 ఏళ్ల పాప ఉంది. కాగా ప్రజంట్ 8 నెలల ప్రెగ్నంట్ స్రవంతి. అయితే 2020లో తన చిన్నమ్మ కూతురు లక్ష్మీప్రసన్నను శ్రీరామకృష్ణ(35) అనే వ్యక్తికి ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేశాడు వెంకటరామకృష్ణ. అయితే కొంతకాలం తర్వాత లక్ష్మీప్రసన్నకు అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. దీంతో చెల్లెలు కాపురం చక్కబెట్టేందుకు పలుమార్లు ప్రయత్నించాడు వెంకటరామకృష్ణ. పెద్దల మనుషుల వరకూ కూడా వెళ్లింది వ్వవహారం. కానీ అంతా సజావుగా సాగకపోవడంతో శ్రీరామకృష్ణ, లక్ష్మీప్రసన్న దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లోనే ఉంటున్న లక్ష్మీప్రసన్న… భర్త, అత్తింటివారిపై చందానగర్ పీఎస్‌లో కేసు పెట్టింది. దీని వెనక కర్త, కర్మ, క్రియ వెంకటరామకృష్ణ దంపతులే అని భావించాడు రామకృష్ణ. వారిపై పగ పెంచుకున్నాడు. చంపాలని కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే ఎర్రగడ్డలో బాగా పదునైన వేట కొడవలి కొన్నాడు. దాన్ని తీసుకుని ఈనెల 6వ తేదీన వెంకటరామకృష్ణ ఇంటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో స్రవంతి మాత్రమే ఇంట్లో ఉంది. ఆమెను చూడగానే కోపంతో ఊగిపోతూ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కనీసం నిండు గర్భిణీ అని కూడా జాలి చూపలేదు. తీవ్ర గాయాలతో ఆమె అదే రోజు మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం