Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Liberation Day: తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాలి.. రజాకార్ల దాడులను గుర్తు చేసిన గవర్నర్ తమిళిసై

సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలని సూచించారు గవర్నర్‌. తెలంగాణ ప్రజలపై జరిగిన వేధింపులను మర్చిపోలేమని అన్నారు. నాడు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని...

Hyderabad Liberation Day: తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాలి.. రజాకార్ల దాడులను గుర్తు చేసిన గవర్నర్ తమిళిసై
Telangana Liberation Day
Follow us
Sanjay Kasula

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 14, 2022 | 2:15 PM

సెప్టెంబర్‌ 17పై తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బుధవారం హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. గ్రౌండ్‌లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలని సూచించారు గవర్నర్‌. తెలంగాణ ప్రజలపై జరిగిన వేధింపులను మర్చిపోలేమని అన్నారు. నాడు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలపై జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలను మర్చిపోలేమని ఆమె చెప్పారు.

నిజాం పాలనలో పరకాలలో 35 మందిని కాల్చి చంపిన ఘటనను గవర్నర్ తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం ఆనాడు చోటు చేసుకున్నాయన్నారు. ఈ తరహ ఘటనలను ఎలా మర్చిపోతామని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనల్లో చనిపోయినవారు మన సోదరులు, సోదరీమణలని ఆమె చెప్పారు. అమరుల రక్తం తెలంగాణపై చిందిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

బైరాన్ పల్లిలో 90 మందిని చంపిన ఉదంతాన్ని గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. గత చరిత్రను దాచిపెట్టలేమన్నారు. ఈ తరం యువత ఆనాడు చోటు చేసుకున్న ఘటనల గురించి తెలుసుకోవాలన్నారు. రజాకారు మూకలు ఈ దాడులు చేశారని గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు. గతంలో హైద్రాబాద్ రాష్ట్రంలో కర్ణాటక, మహరాష్ట్రలోని పలు ప్రాంతాలు ఉండేవన్నారు.

కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానం పంపింది కేంద్రం. హైద్రాబాద్ వేదికగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారు. నిజాం పాలన ఉండి ఈ ప్రాంతాలు కూడ ఆనాడు విముక్తి పొందినందున ఈ రెండు రాష్ట్రాలకు చెందిన సీఎంలకు కూడా కేంద్రం ఆహ్వానం పంపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!