AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: “అమ్మ కొడుతోంది.. అన్నం పెట్టకుండా వేధిస్తోంది సార్”.. తల్లిపై పోలీసులకు కంప్లైంట్ చేసిన చిన్నారి

సాధారణంగా ఎనిమిదేళ్ల పిల్లలు పోలీసులంటే భయపడుతుంటారు. వారు కనిపిస్తే చాలు ఆమడ దూరం పరిగెడతారు. కానీ ఓ చిన్నారి మాత్రం తన తల్లి పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తల్లిపై కంప్లైంట్ చేసి..

Video Viral: అమ్మ కొడుతోంది.. అన్నం పెట్టకుండా వేధిస్తోంది సార్.. తల్లిపై పోలీసులకు కంప్లైంట్ చేసిన చిన్నారి
Child Complaint Police
Ganesh Mudavath
|

Updated on: Sep 14, 2022 | 10:41 AM

Share

సాధారణంగా ఎనిమిదేళ్ల పిల్లలు పోలీసులంటే భయపడుతుంటారు. వారు కనిపిస్తే చాలు ఆమడ దూరం పరిగెడతారు. కానీ ఓ చిన్నారి మాత్రం తన తల్లి పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తల్లిపై కంప్లైంట్ చేసి, చర్యలు తీసుకోవాలని ఏడుస్తూ చెప్పాడు. బాలుడి తీరుతో విస్తుపోయిన పోలీసులు అతనికి, తల్లికి నచ్చజెప్పారు. బీహార్‌లోని సీతామడి పోలీస్ స్టేషన్ కు ఎనిమిదేళ్ల బాలుడు ఏడుస్తూ వెళ్లాడు. అక్కడ ఉన్న పోలీసులకు తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. తనకు అన్నం పెట్టట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు. అన్నం అడిగితే పెట్టడం లేదని, దారుణంగా కొడుతోందని కన్నీటిపర్యంతమయ్యాడు. సమయానికి అన్నం పెట్టడం లేదని, ఒక్కోసారి తాను తింటుంటే ప్లేట్ లాక్కుంటుతందని చెప్పాడు. చిన్నారి ఇచ్చిన కంప్లైంట్ కు అక్కడి పోలీసులు షాక్ అయ్యారు. ఏడుస్తున్న బాలుడ్ని ఓదార్చి అన్నం పెట్టారు. తృప్తిగా తిన్నాక వివరాలు సేకరించారు. తాను నాలుగో తరగతి చదువుతున్నానని, నాన్న మరో చోట ఉంటాడని తాను తల్లి తో కలిసి ఉంటానని చెప్పాడు.వివరాల ఆధారంగా పోలీసులు బాలుడి ఇంటికి వెళ్లారు.

చిన్నారి తల్లితో మాట్లాడగా తాను అలాంటిదేమీ చేయడం లేదని, అల్లరి చేస్తుంటాడని అలాంటి పరిస్థితుల్లో కోపం పట్టలేక తిడుతుంటానని ఆమె చెప్పారు. చిన్నారిని మంచిగా చూసుకోవాలని, సమయానికి భోజనం పెట్టి స్కూల్ కు పంపించాలని తల్లిని మందలించారు. బాలుడు కంప్లైంట్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..