Viral Photo: చిన్నప్పుడే పోలీసుగా మారిన ఈ చిన్నోడు.. ఇప్పుడు మాత్రం టాలీవుడ్ హీరో.. ఈ పాన్ ఇండియా స్టార్ ఎవరో గుర్తుపట్టండి..
చిరునవ్వులు చిందిస్తూ నిల్చున్న ఈ చిన్నోడు ఇప్పడుు టాలీవుడ్ క్రేజీ హీరో. కేవలం సౌత్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో.
ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకమంది సినీతారల చిన్ననాటి ఫోటోస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నార్త్, సౌత్ తేడా లేకుండా హీరోహీరోయిన్లకు సంబంధించిన బాల్యం జ్ఞాపకాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక వారిని గుర్తించేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే తమ అభిమాన హీరోస్ చిన్నప్పుడు ఎలా ఉన్నారు అనే విషయం తెలుసుకోవడంలోనూ ముందుంటున్నారు. ఇటీవల రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, నాని, విజయ్ దేవరకొండ, కాజల్, సమంత, తమన్నా, కృతిశెట్టి, నయన్ ఇలా అందరి చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి. తాజాగా మరో చిన్నోడి పిక్ నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఎవరో చూసేద్దామా.
పైన ఫోటోలో గోపికమ్మ పక్కన స్టైల్‌గా చిరునవ్వులు చిందిస్తూ నిల్చున్న ఈ చిన్నోడు ఇప్పడుు టాలీవుడ్ క్రేజీ హీరో. కేవలం సౌత్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో. యూత్ లో యమ ఫాలోయింగ్ ఉంది. ఎవరో గుర్తుపట్టండి. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎవరో గుర్తుపట్టండి.
ఈ చిన్నోడు మరెవరో కాదు.. క్రేజీ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో జీవించేశాడు. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలో, తమిళ్, మలయాళ, కన్నడ భాషలలో విడుదలై మంచి విజయం అందుకుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.