Pooja Hegde: పూజా హెగ్డేకు బెస్ట్ హీరోయిన్‏గా సైమా అవార్డ్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో పూజా నటనకు ఈ అవార్డ్ వచ్చింది. అయితే అవార్డ్ పొందిన సంతోషంలో పూజా తేలిపోతుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Pooja Hegde: పూజా హెగ్డేకు బెస్ట్ హీరోయిన్‏గా సైమా అవార్డ్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Pooja Hegde
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2022 | 9:16 AM

దక్షిణాది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది పూజా హెగ్డే (Pooja Hegde). హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఓవైపు హీరోయిన్‏గా భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ..మరోవైపు ఐటెం సాంగ్స్‏లోనూ తళుక్కుమంటుంది. ఇటీవలే ఆ అమ్మడు నటించిన ఈ చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయినా తెలుగుతోపాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటుంది పూజా. ఇక ఇటీవల సైమా అవార్డ్స్ 2022లో పూజా హెగ్డేకు బెస్ట్ హీరోయిన్‏గా అవార్డ్ వరించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో పూజా నటనకు ఈ అవార్డ్ వచ్చింది. అయితే అవార్డ్ పొందిన సంతోషంలో పూజా తేలిపోతుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

సైమా అవార్డ్స్ 2022లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలతోపాటు.. శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ సినిమాలు కూడా నామినేట్ అయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. అయితే బెస్ట్ హీరోయిన్‏గా సాయి పల్లవి కాకుండా.. ఓ సాధారణ యువతి పాత్రలో కనిపించిన పూజాకు అవార్డ్ రావడంతో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా నటించిన సాయి పల్లవికి అవార్డ్ రాకుండా పూజాకు రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె పోషించిన పాత్ర ఛాలెంజింగ్ రోల్ కాదు. ఓ సాధారణ అమ్మాయి పాత్రలో నటించింది. ఆ నటనకే బెస్ట్ హీరోయిన్ గా అవార్డ్ రావడమేంటీ.. శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సాయి పల్లవి పోషించిన పాత్రకు ఎందుకు రాలేదు ? సైమా అవార్డ్స్ అనేవి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూజా కూడా డబ్బులిచ్చి అవార్డ్ కొనుక్కుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు సైమా అవార్డ్స్ నిర్వాహకులు.. పూజా హెగ్డే ఈ అవార్డ్ వేడుకలకు వస్తే పబ్లిసిటి పెరుగుతుందని భావించి ఆమెకు అవార్డ్ ఇచ్చారని.. ఇందులో పూజాను ట్రోల్ చేయడం సరైనది కాదంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.