AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: గుండె నిండా బాధలోనూ అభిమానులను మరువని హీరో.. కృష్ణంరాజు అంత్యక్రియల్లో ప్రభాస్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

తన పెదనాన్న అంత్యక్రియలలో పాల్గోనేందుకు వచ్చినవారంతా తిని వెళ్లాలని భోజనం ఏర్పాట్లు చేయించాడట డార్లింగ్. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభాస్ పై ప్రశంసు కురిపిస్తున్నారు.

Prabhas: గుండె నిండా బాధలోనూ అభిమానులను మరువని హీరో.. కృష్ణంరాజు అంత్యక్రియల్లో ప్రభాస్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2022 | 7:23 AM

Share

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణాన్ని తెలుగు ప్రజలు.. సినీతారలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో రెబల్ స్టార్‏ అంత్యక్రియలు నిర్వహించి నివాళులు అర్పించారు. కృష్ణంరాజు మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన ప్రభాస్ (Prabhas).. గుండె నిండా బాధలోనూ అభిమానుల కోసం ఆలోచించారట. తన పెదనాన్న అంత్యక్రియలలో పాల్గోనేందుకు వచ్చినవారంతా తిని వెళ్లాలని భోజనం ఏర్పాట్లు చేయించాడట డార్లింగ్. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభాస్ పై ప్రశంసు కురిపిస్తున్నారు.

తన పెదనాన్న అంత్యక్రియలలో ఫ్యాన్స్‏తో ప్రభాస్ మాట్లాడుతున్న వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందరూ భోజనం చేసి వెళ్లండి అంటూ చెప్పుకొచ్చాడట ప్రభాస్. మనసులో బాధను పెట్టుకుని కూడా అభిమానుల కడుపు నింపాలని ఆలోచించిన ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజు ఎక్కడున్నా రాజే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ప్రభాస్ మాత్రమే కాదు.. కృష్ణంరాజు సైతం ఎప్పుడూ కూడా అభిమానులకు.. తన ఇంటికి వచ్చినవారికి భోజనం పెట్టాలనే ఆలోచిస్తుంటారు. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలని చూస్తుంటారు. ఇక డార్లింగ్ తన సినిమా షూటింగ్ సెట్‏లో అందరికీ సరిపడా భోజనాన్ని ఇంటినుంచే రెడీ చేయించి తీసుకెళ్తుంటాడు. తెలుగు వంటకాలను ఎంతో మంది సెలబ్రెటీలకు అందించాడు ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ సలార్, స్పిరిట్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే చిత్రాల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు