Anupama Parameswaran: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన అనుపమ.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కేరళ కుట్టి.. హీరో ఎవరంటే..
ఈ మూవీ తర్వాత అనుపమ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఆమె క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటేస్ట్ చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). తెలుగులోనే కాకుండా హిందీలోనూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోయింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక కార్తీకేయ 2 సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత అనుపమ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఆమె క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.
మాస్ మాహరాజా రవితేజ ప్రధాన పాత్రలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుపమను కథానాయికగా ఎంపిక చేశారట. అలాగే ఈ మూవీకి ఈగల్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అనుపమ చేతిలో రెండు చిత్రాలున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా 18 పేజేస్ చిత్రం కాగా.. మరోకటి బటర్ ఫ్లై. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.