AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dulquer salmaan: ‘నేను సినిమాలను మానేయాలని వాళ్లు కోరుకున్నారు.. అది చాలా బాధపెట్టింది’.. సీతారామం హీరో సెన్సెషనల్ కామెంట్స్..

డైరెక్టర్ ఆర్.బాల్కీ దర్శకత్వంలో చుప్.. రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 23న విడుదల కానుంది.

Dulquer salmaan: 'నేను సినిమాలను మానేయాలని వాళ్లు కోరుకున్నారు.. అది చాలా బాధపెట్టింది'.. సీతారామం హీరో సెన్సెషనల్ కామెంట్స్..
Dulquer Salmaan
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2022 | 11:12 AM

Share

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer salmaan). ఇందులో జెమినీ గణేషన్ పాత్రలో జీవించి ఆడియన్స్ మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. కీర్తిసురేష్, దుల్కర్ సల్మాన్ నటనకు సినీ విమర్శకులు సైతం ముగ్దులయ్యారు. ఇక ఇటీవల సీతారామం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించి మెప్పించాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా భారీగా వసూళ్లు రాబట్టడమే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్‏కు ప్రత్యేక గుర్తింపు తెచ్చంది. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ ఆర్.బాల్కీ దర్శకత్వంలో చుప్.. రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 23న విడుదల కానుంది. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్.. నెగిటివ్ రివ్యూస్… చెడు విమర్శలు ఎదుర్కొంటున్న ఓ కళాకారుడి బాధను ఈ మూవీలో చూపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్ గురించి స్పందించారు.

కెరీర్ ఆరంభంలో తనపై కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారని.. తన నటన సరిగ్గా లేదంటూ రివ్యూ ఇచ్చారని తెలిపారు. “ను ఎక్కువగా నా గురించి చెడు రివ్యూస్ చదివాను. కొన్నిసార్లు ప్రజలు నేను సినిమాలు మానేయాలని వారు కోరుకుంటున్నట్లుగా రాశారు. నేను నటన కోసం తయారు చేయబడలేదని.. అందుకే నేను ఇండస్ట్రీలో ఉండకూడదని కోరుకున్నారు. అంతేకాకుండా నన్ను ఇండస్ట్రీ కోరుకోవడం లేదన్నారు. ఇలాంటి రివ్యూస్ చాలా బాధపెడతాయి” అంటూ చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ కేవలం హీరోగానే కాకుండా.. సింగర్ గానూ రాణిస్తున్నారు.