SBI: బ్యాంకింగ్ రంగంలో SBI మరో తిరుగులేని రికార్డు.. మార్కెట్ విలువ ఎంతో తెలుసా..

బ్యాంకింగ్ రంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI మరో తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఇప్పటివరకు ఏ బ్యాంకు సాధించని ఘనతను ఎస్బీఐ సొంతం చేసుకుంది. తద్వారా మార్కెట్‌ విలువ పరంగా..

SBI: బ్యాంకింగ్ రంగంలో SBI మరో తిరుగులేని రికార్డు.. మార్కెట్ విలువ ఎంతో తెలుసా..
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 14, 2022 | 5:15 PM

SBI: బ్యాంకింగ్ రంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI మరో తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఇప్పటివరకు ఏ బ్యాంకు సాధించని ఘనతను ఎస్బీఐ సొంతం చేసుకుంది. తద్వారా మార్కెట్‌ విలువ పరంగా సరికొత్త మైలురాయిని చేరుకుంది. 5 ట్రిలియన్‌ రూపాయల అంటే 5 లక్షల కోట్లు మార్కెట్‌ విలువను అందుకున్న తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. ఈ విషయంలో బ్యాంకింగ్‌ రంగంలో మూడో బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలవగా.. అన్ని కంపెనీలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఏడో స్థానంలో నిలిచింది. ఇంట్రా డే ట్రేడ్‌లో ఈ బ్యాంక్‌ షేర్లు దాదాపు 3 శాతం పెరిగి ఆ బ్యాంక్‌ షేరు లాభపడడంతో ఈ మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం SBI మార్కెట్ విలువ 5 లక్షల 72 వేల కోట్లుగా ఉంది. గత కొద్దిరోజులుగా SBI షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.

గడిచిన ఏడాది కాలంలో  స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా షేరు 22 శాతం లాభపడగా.. గడిచిన మూడు నెలల్లో ఏకంగా 26 శాతం మేర లాభపడింది. సెప్టెంబర్ 14వద తేదీ నాటి ట్రేడింగ్‌లో SBI షేరు గరిష్ఠంగా రూ.5664.45 శాతానికి చేరడంతో ఈ మైలురాయిని చేరుకొంది. ఈ విషయంలో బ్యాంకింగ్‌ రంగంలో ఇంతకుముందు HDFC, ICICI మాత్రమే ఈ మైలురాయిని అందుకొన్నాయి. ఇలా ఉండగా.. రుణాల్లో వృద్ధి పెరుగుతోందని ఇటీవల RBI ఇచ్చిన డేటాతో SBIతో పాటు ఇతర బ్యాంక్‌ షేర్లు రాణించడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దేశీయ బ్యాంకుల రుణాలు తొమ్మిదేళ్ల గరిష్ఠానికి చేరాయని రిజర్వు బ్యాంకు గత నెల డేటా వెలువరించింది. దీంతో కొన్ని సెషన్లుగా బ్యాంకింగ్‌ షేర్లు రాణిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..