Passport Photo Update: పాస్‌పోర్ట్‌లో ఫోటోను మార్చాలనుకుంటున్నారా..? ఇలా చేయండి

Passport Photo Update: దేశ పౌరులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన భారతీయ పాస్‌పోర్ట్ పత్రం అంతర్జాతీయ ప్రయాణ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది..

Passport Photo Update: పాస్‌పోర్ట్‌లో ఫోటోను మార్చాలనుకుంటున్నారా..? ఇలా చేయండి
Passport Photo Update
Follow us
Subhash Goud

|

Updated on: Sep 14, 2022 | 6:38 PM

Passport Photo Update: దేశ పౌరులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన భారతీయ పాస్‌పోర్ట్ పత్రం అంతర్జాతీయ ప్రయాణ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది. ఇది అనేక విధాలుగా ఉపయోగించబడే ముఖ్యమైన గుర్తింపు రుజువు పత్రంగా కూడా పనిచేస్తుంది. భారతీయ పాస్‌పోర్ట్ జారీ చేసిన తేదీ నుండి 10 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత దానిని పునరుద్ధరించుకోవాలి. ఇతర పత్రాలలాగా పాస్‌పోర్ట్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. దాని గడువు తేదీకి ముందు పునరుద్దరించుకోవాల్సి ఉంటుంది. తమ పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించాలనుకునే వారు ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని భారతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పాస్‌పోర్ట్‌లో ఉండే ఫోటోను కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే ముందు దిగిన ఫోటో సరిగ్గా లేకపోవడం, లేదా అప్పుడు దిగిన ఫోటో పెద్దయ్యాక వేరేగా అనిపించడం తదితర కారణాల ఉండవచ్చు. అలాంటి సమయంలో పాస్‌పోర్ట్‌లో ఉన్న ఫోటోను మార్చుకోవచ్చు. పాస్‌పోర్ట్‌లో మీ ఫోటోగ్రాఫ్‌ను మార్చడానికి మీరు పాస్‌పోర్ట్ ‘రీ-ఇష్యూ’ కోసం దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌లో ఫోటోగ్రాఫ్‌ మార్చడం ఎలా..?

☛ పాస్‌పోర్ట్ సేవా కేంద్ర కార్యాలయం passportindia.gov.in నుండి ఫారమ్ 2 పొందండి . అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఇవి కూడా చదవండి

☛ మీరు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో నింపుతున్నట్లయితే, ‘అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ ఏరియా నుండి ‘పాస్‌పోర్ట్ రీఇష్యూ’పై క్లిక్ చేయండి

☛ ఇప్పుడు ఎక్సిస్టింగ్ పర్సనల్‌లో చేంజ్‌పై క్లిక్ చేసి, సంబంధిత ఆప్షన్‌ను ఎంచుకోవాలి

☛ ఇప్పుడు సమీపంలోని పాస్‌పోర్ట్ కార్యాలయంలో అపాయింట్‌మెంట్‌ని షెడ్యూల్ చేయండి. ఫారమ్, చెల్లింపు/ఫీజులను అవసరమైన పత్రాలతో పాటు సమర్పించండి

☛ తర్వాత మీరు అవసరమైన మార్పులతో మీ కొత్త పాస్‌పోర్ట్‌ను అందుకుంటారు

 తత్కాల్ సేవతో భారతదేశంలో పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి..

☛ పాస్‌పోర్ట్ విభాగం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

☛ ఇప్పుడు రిజిస్టర్ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. మీరు ఇప్పటికే ఉన్న వినియోగదారు కానట్లయితే, మీరు ‘న్యూ యూజర్ రిజిస్టర్ నౌ’పై క్లిక్ చేయడం ద్వారా అకౌంట్‌ను సృష్టించాలి.

☛ వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్టర్ అయినట్లయితే, మీరు ‘ఎక్సిస్టింగ్ యూజర్ లాగిన్’ లింక్‌ని ఉపయోగించి లాగిన్ చేయవచ్చు.

☛ ‘ఫ్రెష్’ ‘రీఇష్యూ’ అనే రెండు ఆప్షన్స్‌లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఇందులో మీకు వర్తించే ఆప్షన్‌ను ఎంచుకోవాలి

☛ ఇప్పుడు స్కీమ్‌ టైప్‌ ప్లాన్‌ కింద ఉన్న తత్కాల్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

☛ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలను నమోదు చేయాలి

☛ తర్వాత ఫారమ్‌ను సబ్మట్‌పై క్లిక్‌ చేయాలి. చెల్లింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రషీదును ప్రింట్‌ తీసుకునేందుకు కొనసాగించండి.

☛ తర్వాత ప్రక్రియ కోసం మీ ప్రాంతంలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో మీ అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోండి. ఈ విధంగా కూడా మీరు ఫోటోను మార్చుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి