AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ అప్‌డేట్‌ తెలుసుకునేందుకు కొత్త నంబర్‌ ఏర్పాటు

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు ఆసరాగా ఉండేందుకు వివిధ రకాల పెట్టుబడి పథకాల ద్వారా మంచి రాబడిపొందే..

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ అప్‌డేట్‌ తెలుసుకునేందుకు కొత్త నంబర్‌ ఏర్పాటు
Pm Kisan
Subhash Goud
|

Updated on: Sep 14, 2022 | 3:09 PM

Share

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు ఆసరాగా ఉండేందుకు వివిధ రకాల పెట్టుబడి పథకాల ద్వారా మంచి రాబడిపొందే విధంగా రూపొందిస్తోంది కేంద్రం. ఇక రైతులకు మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన పథకాల్లో కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ ఒకటి. ఈ పథకం ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకోవచ్చు. ఏడాదిలో రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటి వరకు రైతులకు 11వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 12వ విడత రానుంది. ఈ డబ్బులు కూడా ఈనెల చివరి నాటికి రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కొన్ని ప్రత్యేక నంబర్లను కేటాయించింది. ఈ నంబర్‌ల ద్వారా రైతులు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

అయితే అగ్రికల్చర్‌ ఇండియా తన అధికారిక ట్వీట్‌లో దేశంలోని రైతులు పీఎం కిసాన్‌ యోజన స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ఓ నంబర్‌ను ఏర్పాటు చేసింది. దరఖాస్తు చేసుకున్న రైతులు155261 నంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా దరఖాస్తు స్థితితో పాటు ఇన్‌స్టాల్‌మెంట్‌ అప్‌డేట్‌ గురించి తెలుసుకోవచ్చు.

మీ ఇన్‌స్టాల్‌మెంట్‌ స్టితిని తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మీరు ముందుగా అధికారి వెబ్‌సైట్‌కి వెళ్లాలి. తర్వాత కుడి వైపున ఉన్న ‘ఫార్మర్స్ కార్నర్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ఓ కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ ఆధార్‌ నంబర్‌, బ్యాంకు అకౌంట్‌ ఏదైనా ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ అకౌంట్‌కు డబ్బు వస్తుందా..?లేదా అనే విషయాన్ని చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మంచి రోజులు వచ్చేశాయ్..! వారు ఓ వెలుగు వెలగడం ఖాయం!
మంచి రోజులు వచ్చేశాయ్..! వారు ఓ వెలుగు వెలగడం ఖాయం!
కాసేపట్లో వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్
కాసేపట్లో వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
రిజెక్ట్ అయిన ప్రతిసారి ఈ ఒక్క పని చేయండి.. పూరి చెప్పిన సత్యాలు.
రిజెక్ట్ అయిన ప్రతిసారి ఈ ఒక్క పని చేయండి.. పూరి చెప్పిన సత్యాలు.
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. లోపల చూడగా..
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. లోపల చూడగా..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
డబ్బుల సంచులు తెస్తున్న బుధుడు.. మీ రాశి లక్కీ లిస్టులో ఉందా?
డబ్బుల సంచులు తెస్తున్న బుధుడు.. మీ రాశి లక్కీ లిస్టులో ఉందా?
ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?
ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?
వేసవిలో చల్లగా ఫ్రీజ్‌ వాటర్‌ తాగే వారికి అలర్ట్‌.. సంగతేమంటే?
వేసవిలో చల్లగా ఫ్రీజ్‌ వాటర్‌ తాగే వారికి అలర్ట్‌.. సంగతేమంటే?