Fact Check: SBI మహిళలకు గ్యారెంటీ లేకుండా 25 లక్షల రుణం ఇస్తోంది.. ఇందులో నిజమెంత..?

Fact Check: దేశంలోని కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు అనేక ప్రభుత్వ పథకాలను అమలు చేస్తోంది. దేశ ప్రజలకు ఆర్థికంగా..

Fact Check: SBI మహిళలకు గ్యారెంటీ లేకుండా 25 లక్షల రుణం ఇస్తోంది.. ఇందులో నిజమెంత..?
Pib Fact Check
Follow us

|

Updated on: Sep 12, 2022 | 7:31 PM

Fact Check: దేశంలోని కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు అనేక ప్రభుత్వ పథకాలను అమలు చేస్తోంది. దేశ ప్రజలకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎన్నో పథకాలను రూపొందిస్తోంది. రకరకాల స్కీమ్‌లను రూపొందిస్తూ సంపాదించుకునే మార్గాలను సృష్టిస్తోంది. అటువంటి పరిస్థితిలో కొంతమంది సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో ప్రజలకు ఆర్థిక సహాయం చేయడానికి సంబంధించి ప్రభుత్వ పథకాల పేరుతో అనేక రకాల ప్రలోభాలను గురి చేస్తున్నారు. దీంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ‘నారీ శక్తి యోజన’ కింద, SBI దేశంలోని మహిళలందరికీ గ్యారెంటీ లేకుండా, వడ్డీ లేకుండా రూ. 25 లక్షల రుణాన్ని ఇస్తోందని ఓ వార్త వైరల్‌ అవుతోంది. దీనితో పాటు వివిధ యూట్యూబ్ ఛానెల్‌లు కూడా ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్నాయి.

ఇందులో నిజమెంతా..? ఈ వైరల్‌ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అంతా అబద్దమని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌చెక్‌ ద్వారా స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ట్విట్‌ చేసింది. ఇలాంటి వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని పేర్కొంది. ఇలాంటి ఫేక్‌ స్కీమ్‌ల గురించి సమాచారంపై జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. మీ మొబైల్‌కు గానీ, ఈమెయిల్‌కు గానీ వచ్చే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్‌ చేయవద్దని, లేకపోతే మీరు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇలాంటి అనుమానస్పద లింక్‌లపై పీఐబీ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో మీకు ఏవైనా అనుమానాస్పద సందేశాలు వస్తున్నాయని మీరు భావిస్తే, మీరు ఈ సందేశాల ప్రామాణికతను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటివి నిజమైనవా..? నకిలీవా..? అనేది తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..