FASTag Balance: ఎస్‌బీఐ ఖాతాదారులు ఫాస్టాగ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా..? సరికొత్త సర్వీస్!
FASTag Balance: జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లించేందుకు ఫాస్టాగ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. టోల్‌గేటు వద్ద వాహనాల రద్దీ..
FASTag Balance: జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లించేందుకు ఫాస్టాగ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. టోల్‌గేటు వద్ద వాహనాల రద్దీ ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ఫాస్టాగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే వాహనదారులు వాహనం నెంబర్, వారి బ్యాంకు అకౌంట్ లింక్ చేస్తే ఫాస్టాగ్ నెంబర్ వస్తుంది. అయితే ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్ సర్వీసులు పొందుతున్న వాహనదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫాస్టాగ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ వివరాలు తెలిసేలా SMS సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఎస్‌బీఐ. వాహనదారులు తమ తమ ఫాస్టాగ్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో సెకన్లలోనే తెలుసుకోవచ్చు. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.
ఎస్‌బీఐ ఫాస్టాగ్ సేవలను ఉపయోగించుకుంటున్న ఖాతాదారులు ఫాస్టాగ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి రిజిస్టర్ ఫోన్ నెంబర్ నుంచి FTBAL అని 7208820019 అనే ఫోన్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉంటే FTBAL< వాహనం నెంబర్> టైప్ చేసి 7208820019 అనే ఫోన్ నెంబర్‌కు మెసేజ్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే మీరు మెసేజ్ పంపుతున్న మొబైల్ నెంబర్ ఎస్‌బీఐ ఫాస్టాగ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇలా చేసినట్లయితే క్షణాల్లో ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలిసిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..