Fact Check: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం కింద మహిళలకు ఉచితంగా రూ.25 లక్షల లోన్‌ ఇస్తున్నట్లు నెట్టింట ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన పీఐబీ!

కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఎటువంటి గ్యారెంటీ లేకుండా మహిళలకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా రూ.25 లక్షలు లోన్‌ ఇస్తున్నట్లు గత కొంత కాలంగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై పీఎఫ్బీ ట్విటర్‌ ద్వారా..

Fact Check: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం కింద మహిళలకు ఉచితంగా రూ.25 లక్షల లోన్‌ ఇస్తున్నట్లు నెట్టింట ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన పీఐబీ!
Fact Check News
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 13, 2022 | 2:03 PM

Is Govt giving Rs 25 lakh loan at Zero per cent interest for women? కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఎటువంటి గ్యారెంటీ లేకుండా మహిళలకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా రూ.25 లక్షలు లోన్‌ ఇస్తున్నట్లు గత కొంత కాలంగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై పీఐబీ ట్విటర్‌ ద్వారా వివరణ ఇచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవమని, అటువంటి ప్రకటనలేవీ కేంద్రం జారీ చేయలేదని, వీటిని నమ్మి, ఫ్రాడ్స్‌ దురుద్ధేశ్యంతో పన్నే వలలో చిక్కుకుని మోసపోవద్దని సూచించింది. సదరు ఫేక్‌ ప్రకటన ప్రకారం.. ‘నారీ శక్తి యోజన’ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఎస్బీఐ బ్యాంకుల నుంచి రూ.25 లక్షలు గ్యారెంటీ, వడ్డీలేకుండా దేశంలోని మహిళలందరికీ మంజూరు చేస్తున్నారనేది సారాంశం. ఈ మేరకు కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు, సోషల్‌ మీడియాల్లో ప్రచారం జరుగుతోంది. ఐతే ఇది పూర్తిగా ఫేక్‌ పథకమని, అటువంటి ప్రకటన ఏదీ కేంద్రం జారీ చేయలేదని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ట్విటర్ ద్వారా వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇటువంటి నకిళీ లింక్‌లను ఎట్టిపరిస్థితిలో క్లిక్ చేయవద్దని PIB సూచించింది.

నకిలీ వార్తలను పీఐబీలో ఏ విధంగా చెక్‌ చేసుకోవాలంటే..

ఇవి కూడా చదవండి

మీ మొబైల్‌ ఫోన్లకు కూడా ఇలాంటి అనుమానాస్పద మేసేజ్‌లు ఏవైనా వస్తే.. అది నిజమో.. కాదో.. ఇలా చెక్‌ చేసుకోండి. అందుకు ముందుగా పీఐబీ అధికారిక వెబ్‌సైట్‌ https://factcheck.pib.gov.in లింక్‌ మెసేజ్‌ను పంపించాలి.

లేదా+918799711259 నంబర్‌కి WhatsApp ద్వారా అయినా మెసేజ్‌ పంపించవచ్చు. అలాగే ఈ మెయిల్‌కు కూడా pibfactcheck@gmail.comకి కూడా పంపవచ్చు. దీనితోపాటు నకిలీ వార్తలకు సంబంధించిన వాస్తవాలను ఎప్పటికప్పుడు https://pib.gov.inలో కూడా చెక్‌ చేసుకోవచ్చు.

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్