Electric Highways: దేశంలో ఎలక్ట్రిక్ హైవేలు.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..
Electric Highways: దేశంలోకి ఎలక్ట్రిక్ హైవేలు రాబోతున్నాయి. అవును, దేశంలో ఎలక్ట్రిక్ హైవేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్రమంత్రి నితిన్..
Electric Highways: దేశంలోకి ఎలక్ట్రిక్ హైవేలు రాబోతున్నాయి. అవును, దేశంలో ఎలక్ట్రిక్ హైవేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. వివరాల్లోకెళితే.. దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మొదటి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలమధ్య నిర్మించనున్నట్లు సమాచారం. ఈ రహదారిపై ట్రాలీ బస్సుల మాదిరిగానే ట్రాలీ ట్రక్కులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. దాని ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు సామర్థ్యం పెరుగుతుందని కేందమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మిస్తున్నామని, టోల్ ప్లాజాల్లోని సోలార్ ఎనర్జీని వినియోగించేలా ప్రోత్సహించనున్నట్టు స్పష్టం చేశారు.
ఇక ఈ ఎలక్ట్రిక్ హైవేలను సులువుగా చెప్పాలంటే.. రైల్వే లైన్లను పోలి ఉంటాయి. రైళ్లు నడిచేటప్పుడు ఏ విధంగా పైనున్న విద్యుత్ లైన్ల సాయంతో పరుగులు పెడతాయో అలాగే జాతీయ రహదారులపై పయనించే వాహనాలు కూడా ఇలాగే విద్యుత్ లైన్లను వినియోగించుకుని బ్యాటరీని రీజార్జ్ చేసుకుంటాయి. ఇక్కడ సోలార్ ఎనర్జీ అందుబాటులో ఉంచుతారు. అయితే ఏ రూట్‌లో ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోందని గడ్కరీ వివరించారు.
మరోవైపు..పెట్రోల్, డీజిల్‌ల ద్వారా కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో, భారీ వాహనాల ఓనర్లు ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలవైపు వెళ్లాలని కోరారు నితిన్ గడ్కరీ. అలాగే అన్ని జిల్లా కేంద్రాలను 4 లైన్ల రహదారులతో అనుసంధానిస్తామన్నారు గడ్కరీ. అటు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందని, RTOల ద్వారా అందే సేవలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు గడ్కరీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..