AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: నియంత్రిత శృంగారంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఆయుర్వేదం చెబుతున్న ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..!

Health Tips: ప్రస్తుత టెక్ యుగంలో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధిలో పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. మన భారతదేశంలో కూడా అందులో అగ్రస్థానంలోనే ఉంది.

Health Tips: నియంత్రిత శృంగారంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఆయుర్వేదం చెబుతున్న ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..!
Health Tips
Shiva Prajapati
|

Updated on: Sep 12, 2022 | 6:14 AM

Share

Health Tips: ప్రస్తుత టెక్ యుగంలో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధిలో పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. మన భారతదేశంలో కూడా అందులో అగ్రస్థానంలోనే ఉంది. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం ఇప్పటికీ అట్టడుగున ఉందనే చెప్పాలి. ముఖ్యంగా శృంగారం విషయంలో పరిస్థితి దారుణం చెప్పుకోవాలి. పాశ్చాత్య దేశాల్లో శృంగారం పట్ల అవగాహన పెంచుకోవడం తప్పనిసరి అని చెబుతుంటారు. కానీ, మన దేశంలో నెటికీ ఆ పదం ఉచ్చరించాలంటే జంకుతారు. అదేదో ఉగ్రవాదులు ఉపయోగించే పదం అన్నట్లుగా భావిస్తుంటారు. ఫలితంగా సెక్స్ పట్ల కనీస అవగాహన లేకుండా చాలా మంది డిప్రెషన్‌కు లోనవడం, అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. సాధారణంగా సెక్స్ అంటే సంతానోత్పత్తి, ఆనందంతో మాత్రమే పోలుస్తారు. కానీ, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోణంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఆయుర్వేదం సైతం శృంగారానికి మద్ధతు ఇస్తుంది. ఎందుకంటే దీని వలన అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతోంది. అనేక అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని తేల్చాయి. ఒత్తిడి, డిప్రెషన్, తక్కువ హెల్త్ రిస్క్, అధిక బరువు తగ్గించే ప్రయోజనాలు కూడా ఉన్నట్లు చెబుతున్నాయి. ఆయుర్వేదం ప్రకారం జీవితానికి మద్ధతు ఇచ్చే మూడు స్తంభాలలో సెక్స్ ఒకటి. పురాతన భారతీయ వైద్య విధానం ప్రకారం.. ఆరోగ్యకరమైన, నియంత్రిత లైంగిక సంపర్కంలో పాల్గొనడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి అవేంటో ఇవ్వాళ మనం తెలుసుకుందాం..

ఆరోగ్య ప్రయోజనాలు..

1. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది

ఇవి కూడా చదవండి

2. ఆరోగ్యకరమైన జ్ఞాపకశక్తి.

3. సరైన పోషణ శరీరానికి అందుతుంది.

4. శారీరక శక్తి పెరుగుతుంది.

5. మేధో సామర్థ్యాలు పెరుగుతాయి.

శృంగారానికి, ఋతువులకు సంబంధం ఏంటి? ఆయుర్వేదం శృంగారం కోసం కొన్ని మార్గదర్శకాలను సూచిస్తుంది. దీనిక ప్రకారం.. స్త్రీ, పురుషులిరువురూ భౌతికంగా ఒక్కటవ్వటానికి ప్రత్యేక సీజన్ ఉంది. చలి కాలం శారీరక కలయికకు అనువైన సమయంగా ఆయుర్వేదం చెబుతోంది. వేసవిలో మాత్రం శృంగారాన్ని నివారించాలని సూచిస్తోంది. అలాగే వర్షాకాలంలో శారీరక బలం తక్కువగా ఉంటుందని, ఈ సమయంలో శృంగారంలో పాల్గొనకపోవడమే ఉత్తమం అని చెబుతోంది ఆయుర్వేదం. ఎందుకంటే, ఇది వాతాన్ని తీవ్రతరం చేస్తుందట. అయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతోంది.

ఆయుర్వేదం ప్రకారం శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి? ఎప్పుడు పాల్గొనవద్దు?

ఆయుర్వేదంలో శృంగారానికి సంబంధించి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. భద్రత విషయంలో ఈ క్రింది నియమాలను పాటించాలని సిఫార్సు చేయడం జరిగింది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. భోజనం జీర్ణమైన తర్వాత మాత్రమే శృంగారంలో పాల్గొనాలి.

2. ఖాళీ కడుపుతో ఎప్పుడూ భౌతికంగా కలవొద్దు.

3. ఇబ్బందికరమైన భంగిమల్లో శృంగారం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

4. శారీరక కలయికకు ముందు స్నానం చేయాలి.

5. ఆరోగ్యకరమైన భోజనం చేయాలి.

6. భాగస్వామితో కలిసిన తరువాత స్నానం చేయాలి. చల్లని గాలికి కాసేపు అటూ ఇటూ తిరగాలి.

7. శృంగారం అనంతరం స్వీట్స్ గానీ, పాలు గానీ తీసుకోవచ్చు.

లైంగిక ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారాలు..

ఆరోగ్యకరమైన లైంగిక కార్యకలాపాలకు శరీరం, మనస్సు ఫిట్‌గా ఉండటం చాలా అవసరం. కావున, లైంగిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం ఏ ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నెయ్యి

2. ఎర్ర బియ్యం.

3. సీతాఫలం.

4. పాలు.

5. బాదం.

6. బాదం పాలు.

(గమనిక: పైన పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ఆసక్తులను పరిగణనలోకి తీసుకుని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా సందేహాలు, సమస్యలుంటే వైద్య నిపుణులను సంప్రదించడం ముఖ్యం.)