Viral Video: ఉస్సేన్ బోల్ట్‌కి ‘తాబేలు’ ఛాలెంజ్.. మెరుపు వేగంతో పరుగులు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..!
Viral Video: పాఠ్యపుస్తకాలు, నీతి కథల్లో తాబేలు, కుందేలు కథలు వినే ఉంటాం. తాబేలు, కుందేలు మధ్య జరిగిన రేస్‌లో.. నెమ్మదిగా నడుస్తూనే తాబేలు, కుందేలును..
Viral Video: పాఠ్యపుస్తకాలు, నీతి కథల్లో తాబేలు, కుందేలు కథలు వినే ఉంటాం. తాబేలు, కుందేలు మధ్య జరిగిన రేస్‌లో.. నెమ్మదిగా నడుస్తూనే తాబేలు, కుందేలును ఓడించిందని చెబుతుంటారు. అప్పటి నుంచి సందర్భానుసారం ఏదో ఒక అంశంలో ఈ తాబేలు నడక గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అయితే, ఆ కథలను, కథనాలను తాజా ఓ తాబేలు పటాపంచలు చేసింది. పరుగుల రారాజు ఉస్సేన్ బోల్ట్‌ను మించి, అతనికే ఛాలెంజ్ విసిరేలా రన్ చేసి ఆశ్చర్యానికి గురి చేసింది తాబేలు. అవును, జెట్ స్పీడ్‌లో పరుగులు తీసిన తాబేలు కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది నిజంగా నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగానే తాబేళ్లు చాలా నెమ్మదిగా నడుస్తాయి. వాటి నడక చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాయి. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో అందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఈ వీడియోలో తాబేలు అప్పటి వరకు నెమ్మదిగా నడిచి.. ఆ వెంటనే జెట్ స్పీడ్‌లో పరుగులు తీసింది. సెకన్ల వ్యవధిలోనే అదృశ్యమై నీటిలోకి దూకేసింది. ఈ తాబేలు రన్నింగ్ క్లిప్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 7.65 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో 23 వేల లైక్స్ వచ్చాయి. రన్నర్ తాబేలుపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఉస్సేన్ బోల్ట్‌ను మించి పరుగులు తీస్తున్న ఈ తాబేలు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Never knew they were that fast.. pic.twitter.com/ckOMDXkOoU
— Buitengebieden (@buitengebieden) September 8, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..